News February 6, 2025
MBNR: జూరాలకు నీటిని విడుదల చేయండి.!
కర్నాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేసి ఉమ్మడి పాలమూరు జిల్లా సాగు, తాగునీటి అవసరాలు తీర్చాలని ఆ రాష్ట్ర సీఎం సిద్దారామయ్యను మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌లు మంగళవారం బెంగళూర్‌లో సీఎంను కలిసి వినతి పత్రం అందించారు.
Similar News
News February 6, 2025
డ్వాక్రా మహిళలకు 50 శాతం రాయితీతో షేడ్ నెట్స్: మంత్రి
AP: ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26లో 5వేల మంది డ్వాక్రా మహిళలకు 50% రాయితీతో షేడ్‌నెట్స్ అందిస్తామని చెప్పారు. ఒక్కో షెడ్ వ్యయం ₹3.22Lకాగా సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని స్త్రీనిధి, బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తామని చెప్పారు. జాతీయ జీవనోపాధుల పథకం కింద రాష్ట్రానికి ₹1,000Cr కేంద్ర నిధులు పొందనున్నట్లు పేర్కొన్నారు.
News February 6, 2025
రైతును ఆత్మహత్యకు ప్రేరేపించినవారిపై అట్రాసిటీ కేసు
మదనపల్లె మండలం, పిచ్చలవాండ్లల్లెలో రైతు నరచంహులు పొలానికి దారి వదలలేదని రెండు రోజుల క్రితం ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. రైతు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన వారిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు, తాలూకా సీఐ కళా వెంకటరమణ బుధవారం తెలిపారు. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా, దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో దారి లేకుండాచేసిన వారిపై ఈకేసు అయింది.
News February 6, 2025
తిరుపతి: రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల మృతి
చిత్తూరు జిల్లా విజయపురం మండల తెల్లగుంట గ్రామ సమీపంలో అన్నాచెల్లెలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బంధువుల సమాచారం మేరకు.. నిండ్ర మండలం అగరం పేట గ్రామానికి చెందిన రవి(48), KVB.పురం మండలం కళత్తూరు గ్రామానికి చెందిన మంజుల (44)అన్నా చెల్లెలు. వారు ఇద్దరు కలిసి పెద్ద అక్క దేశమ్మ ఇంటికి వెళ్లి తిరిగి ప్రయాణంలో తెల్లగుంట వద్ద లారీ ఢీకొని మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.