News February 6, 2025
ఆదిలాబాద్‌లో 100 రోజుల TB క్యాంపెనింగ్
జిల్లాలో వందరోజుల టీబీ క్యాంపెనింగ్‌లో వల్నరబుల్ పాపులేషన్స్‌కి వాహనాల ద్వారా ఎక్స్రే రేకు పంపాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎపిడెమిక్ సెల్, ఆర్బీఎస్కే వాహనాలను 100 రోజుల శిబిరానికి వినియోగించుకోవాలన్నారు. అర్బన్ స్లమ్స్, 50 రోజుల్లో శిబిరాలు జరగని గ్రామాల్లో శిబిరాన్ని నిర్వహించాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. టీబీ లక్షణాలు కలిగిన వారిని గుర్తించాలన్నారు.
Similar News
News February 6, 2025
సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలి: ADB కలెక్టర్
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన అన్ని సివిల్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, మరుగుదొడ్లు, తాగునీరు, పూర్తైన ఇందిరమ్మ మోడల్ గృహాల గ్రౌండింగ్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయడానికి తహశీల్దార్లు అనుమతులు ఇవ్వాలన్నారు.
News February 6, 2025
బోథ్: వ్యక్తి మృతికి కారణమైన నిందితుడి రిమాండ్
బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామానికి చెందిన బండారి చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. మూడు రోజుల క్రితం నిందితుడు తన శనగ పంట చుట్టూ కరెంటు వైర్ అమర్చడంతో అతడి దగ్గర పని చేస్తున్న పాలేరు మేస్రం కృష్ణ విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.
News February 6, 2025
బోథ్: గుండెనొప్పితో ఉపాధ్యాయుడు మృతి
బోథ్‌లోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు దేవరాజ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇచ్చోడ మండలం కోకస్ మున్నూరు గ్రామానికి చెందిన దేవరాజ్ బుధవారం ఎప్పటిలాగే పాఠశాల విధులకు హాజరయ్యాడు. సాయంత్రం గుండెలో నొప్పి వస్తుందని తోటి ఉపాధ్యాయులకు తెలపడంతో వారు ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.