News February 6, 2025
నాణ్యమైన కాఫీకి అధిక ధరలు చెల్లించండి: కలెక్టర్
నాణ్యమైన కాఫీని సరఫరా చేసిన రైతులకు అధిక ధరలు చెల్లించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏఈవోలు, హర్టీకల్చర్ కన్సల్టెంట్లు, ఫీల్డ్ కన్సల్టెంట్లతో సమావేశం నిర్వహించారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆర్గానిక్ కాఫీ పండిస్తున్న రైతుల వద్ద ఉన్న నిల్వలను గుర్తించి సేకరించాలన్నారు. గిరిజన రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధరలను చెల్లించాలని ఆదేశించారు.
Similar News
News February 6, 2025
87 మద్యం షాపులకు ఒక్క దరఖాస్తూ లేదు
AP: కల్లు గీత కులాలకు ప్రభుత్వం ప్రకటించిన మద్యం షాపుల పాలసీకి స్పందన కరువైంది. 339 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే నిన్నటికి 730 దరఖాస్తులే వచ్చాయి. అందులో 87 షాపులకు ఒక్కరు కూడా అప్లై చేయలేదు. దీంతో ఎక్సైజ్ వర్గాలు షాకయ్యాయి. ప్రభుత్వం 10% మార్జిన్ మాత్రమే ఇస్తుండటం, ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. కాగా దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించారు.
News February 6, 2025
పార్వతీపురం: ‘డీ – వార్మింగ్‌డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’
జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన జరగనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమ బ్యానర్‌ను కలెక్టర్, వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న డీ-వార్మింగ్ డే, 17న మాప్ అప్‌డే కార్యక్రమాలు జరగనున్నాయని అన్నారు.
News February 6, 2025
ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.