News February 6, 2025

ఆహార సరఫరాలో అవకతవకలు జరిగితే సమాచారం ఇవ్వండి

image

రేషన్, హాస్టల్స్ లో ఆహారం సరఫరాలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే ప్రజలు ఫుడ్ కమిషన్ వాట్సాప్ నంబర్ 9490551117 కి వీడియోల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. బుధవారం గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌ను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులను ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహశీల్దార్ చంద్రశేఖర్, సీడీపీఓ మెహబూబి ఉన్నారు.

Similar News

News March 23, 2026

ఎన్పీడీసీసీఎల్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

image

ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 12వ PSU అవార్డు 2026 ఆపరేషనల్ ఎక్సలెన్స్, ఆటోమేషన్ డిజిటల్ టెక్నాలజీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎన్పీడీసీసీఎల్‌కు వరించిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఈ అవార్డును ఇటీవల న్యూ ఢిల్లీలో కంపెనీ తరఫున అందుకున్న కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం సోమవారం కంపెనీ డైరెక్టర్లు, సీఈల సమక్షంలో సీఎండీకి అందించారు.

News March 23, 2026

కీలక బిల్లు: విద్వేష ప్రసంగాలు చేస్తే 7 ఏళ్ల జైలు

image

TG: విద్వేష ప్రసంగాలు చేసేవారి భరతం పట్టేలా కీలక బిల్లును GOVT ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇలాంటి ప్రసంగాలు చేస్తే తొలిసారి ₹50000 జరిమానా, 7 ఏళ్ల జైలు విధిస్తారు. రెండోసారి కూడా చేస్తే ₹1 లక్ష జరిమానా, 10 ఏళ్లు జైలు తప్పదు. ఇప్పటికే ఇలాంటి చట్టం కర్ణాటకలో ఉంది. కాగా పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనం నుంచి 10-15% కట్ చేసి వారికి అందించేలా మరో బిల్లునూ త్వరలో పెట్టనున్నారు.

News March 23, 2026

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్ రాహుల్ శర్మ

image

భూపాలపల్లి జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.