News February 6, 2025
పార్వతీపురం: ‘ఒక్క మాతా, శిశు మరణం కూడా సంభవించకూడదు’

పార్వతీపురం జిల్లాలో ఒక్క మాతా, శిశు మరణం కూడా సంభవించకూడదని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులకు హితవు పలికారు. ప్రతి గర్భిణీ స్త్రీ ప్రసవం అయ్యే వరకు సంబంధిత పిహెచ్సీ వైద్యాధికారి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రసవాలు సురక్షంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News January 19, 2026
సంక్రాంతి ముగిసింది.. రొటీన్ లైఫ్ మొదలైంది

సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఇష్టం లేకపోయినా, మనసుకు కష్టమైనా సరే పల్లెలు విడిచి తిరిగి పట్టణాలకు చేరుకున్నారు. మళ్లీ అదే ఉరుకులు పరుగుల జీవితంలోకి అడుగు పెట్టేశారు. బాస్ మెప్పు కోసం తిప్పలు, కెరీర్ వెనుక పరుగులు, నైట్ షిఫ్టులతో కుస్తీలు పడాల్సిందే. ఈ ఏడాది సొంతూరులో గడిపిన క్షణాలు, అమ్మానాన్న ఆప్యాయతలు, అయినవాళ్ల పలకరింపులను మనసులో దాచుకుని మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు వాటినే నెమరువేసుకోవాలి!
News January 19, 2026
NZB: సంక్రాంతి ఎఫెక్ట్.. రూ. 27.89 కోట్ల మద్యం విక్రయం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పండుగ సందర్భంగా రూ. 27.89 కోట్ల మద్యం అమ్ముడుపోయిందని అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 151 వైన్స్‌లు, 29 బార్ల యజమానులు పండుగను పురస్కరించుకుని ఈ నెల 12 నుంచి మాక్లూర్ మండలంలోని IML డిపో నుంచి మద్యం స్టాక్ కొనుగోలు చేశారు. ఈ మేరకు ఈ నెల 12న రూ. 7.62 కోట్లు, 13న రూ. 4.82 కోట్లు, 14న రూ.6.87 కోట్లు, 16న రూ. 8.08 కోట్ల మద్యాన్ని కొన్నారు.
News January 19, 2026
24% పెరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు

భారత్ నుంచి 2025లో ఆటోమొబైల్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2024లో 50,98,474 వాహనాల ఎగుమతి జరగ్గా.. గతేడాది ఆ సంఖ్య 63,25,211(24.1%)కు చేరింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డిమాండ్ బాగా పెరుగుతోంది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతి 16%, యుటిలిటీ వెహికల్స్ 32శాతం, కార్ల ఎగుమతులు 3% మేర పెరిగాయి. వీటిలో 3.95 లక్షల యూనిట్లు ఎగుమతి చేసి మారుతీ సుజుకీ అగ్రస్థానంలో నిలిచింది.


