News February 6, 2025
MHBD: కేజీబీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని(కేజీవిబీ) కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని కిచెన్ షెడ్, షెడ్, హాల్, క్లాస్ రూమ్, స్టోర్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూను పక్కాగా అమలు చేయాలని సూచించారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్ కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐబొమ్మ’ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతడి అకౌంట్లోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. సినిమాలను విడుదలైన రోజే పైరసీ చేసి వెబ్‌సైట్‌లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు iBommaపై కంప్లైంట్లు ఇచ్చారు.
News November 15, 2025
విజయవాడ: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

విజయవాడలోని సూర్యారావుపేట వద్ద గురువారం మధ్యాహ్నం సరస్వతి అనే మహిళను ఆమె భర్త విజయ్ హత్య చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య కలహాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం నిందితుడు విజయ్‌ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ ఆలీ చెప్పారు. అతని వద్ద నుంచి రెండు పదునైన ఆయుధాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు.
News November 15, 2025
సంగారెడ్డి: ‘NMMS హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలి’

ఎన్ఎంఎంఎస్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. www.bse.telangana.comలో యూసర్ నేమ్, పాస్వర్డ్ ఉపయోగించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఈనెల 23న ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని తెలిపారు.


