News March 19, 2024
సూర్య హార్ట్ బ్రేక్ పోస్ట్

ఐపీఎల్ ముంగిట ముంబై ఇండియన్స్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టారు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో అతడికి చీలమండ గాయం కాగా జనవరిలో సర్జరీ చేయించుకున్నారు. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఐపీఎల్ సీజన్-17 ఆడేందుకు అతడికి జాతీయ క్రికెట్ అకాడమీ NOC ఇవ్వనట్లు సమాచారం. దీంతోనే సూర్య హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి.
Similar News
News August 29, 2025
TODAY HEADLINES

* రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు: చంద్రబాబు
* ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకూడదు: సీఎం రేవంత్
* మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు: జగన్
* తెలంగాణ సీఎస్ పదవీకాలం పొడిగింపు
* హిందువులు ముగ్గురు పిల్లలను కనాలి: RSS చీఫ్
* మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రేపు సెలవు
* APకి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా
* అఖండ 2, రాజా సాబ్ సినిమా రిలీజ్ వాయిదా
* TG: రవాణాశాఖ ఆధ్వర్యంలోని చెక్పోస్టులు రద్దు
News August 29, 2025
BREAKING: చెక్ పోస్టులన్నీ రద్దు

TG: రవాణాశాఖ ఆధ్వర్యంలోని 14 బార్డర్ చెక్పోస్టులు, కామారెడ్డిలోని RTA చెక్ పోస్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు, అనవసరంగా ఆపడాలు వంటివి తగ్గి వాహనాలు వేగంగా కదులుతాయి. సమయం, ఇంధన ఖర్చులు తగ్గుతాయి. ఇదే సమయంలో వాహన పర్మిట్లను వాహనదారులు ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ స్క్వాడ్ ద్వారా RTA అధికారులు పర్మిట్లను తనిఖీ చేస్తారు.
News August 29, 2025
శ్రీశైలంలో విరిగిపడిన కొండ చరియలు

భారీ వర్షాల ధాటికి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడటంతో శ్రీశైలం-హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. కాగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2.38 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది.