News February 6, 2025
బియ్యం అక్రమరవాణా తగదు: జేసీ అభిషేక్ కుమార్

జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని సివిల్ సప్లై, డిప్యూటీ తహశీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిత్యావసర సరకుల పంపిణీలో ఎలాంటి అక్రమ లావాదేవీలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.
Similar News
News November 13, 2025
గుడివాడకు జనవరి 12వ తేదీ నుంచి వందే భారత్ రైలు

చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు జనవరి 12వ తేదీ నుంచి పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం కానుంది.
News November 13, 2025
సిద్దిపేట: ఏడాదిలో 777 మైనర్ డ్రైవింగ్ కేసులు

సిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది కాలంలో మొత్తం 777 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. విద్యార్థులు అధికంగా ఉండే స్కూళ్లు, కాలేజీల వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. పట్టుబడితే మరుసటి రోజు తల్లిదండ్రులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
News November 13, 2025
జూబ్లీహిల్స్: పైసలిచ్చినా ఓటెయని వారి నుంచి వసూళ్లు!

జూబ్లీహిల్స్ ఓటింగ్ అందరినీ నిరాశకు గురిచేసింది. పోలింగ్ 50% నమోదు కాకపోవడంతో అసహనం వ్యక్తం అవుతోంది. డబ్బులు తీసుకొని కూడా ఓటు వేయని వారి ఇళ్లకు నాయకులు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. అపార్ట్‌మెంట్‌లో ఉండే సగం మంది బయటకు రాలేదని గుర్తించిన బూత్ కమిటీ సభ్యులు తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలింగ్ పర్సంటేజ్ తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చినట్లు సమాచారం.


