News February 6, 2025

ఔదార్యం చాటుకున్న ఖానాపూర్ మహిళా పోలీసులు

image

ఖానాపూర్ పట్టణంలో బుధవారం మహిళా పోలీసులు ఔదార్యం చాటుకున్నారు. మల్లీశ్వరి, నర్సమ్మ పట్టణంలో విధలు నిర్వహిస్తుండగా బట్టలు లేకుండా తిరుగుతున్న మతిస్థిమితం లేని ఓ మహిళకు బట్టలు అందజేసి భోజనం పెట్టించారు. అనంతరం ఆమె వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.  

Similar News

News March 15, 2026

సమస్యల పరిష్కారానికి ‘మీకోసం’ వెబ్‌సైట్: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు కేవలం ప్రత్యక్షంగానే కాకుండా ‘మీకోసం’ వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించే PGRS, రెవెన్యూ క్లినిక్ సేవలను నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

News March 15, 2026

కడప: 16 నుంచి పశువులకు టీకాలు

image

ఈనెల 16 నుంచి ఏప్రిల్ 20 వరకు జిల్లాలో ప్రతి గ్రామంలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్.ఏ.శ్రీనివాసులు తెలిపారు. కడప జిల్లాకు 3 లక్షల డోసులను కేటాయించామన్నారు. పాడి పశువుల యాజమానులందరూ పశువైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. గాలి కుంటు వ్యాధి సోకుతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 15, 2026

GNT: అక్షరాంధ్ర పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లాలో నిర్వహించిన ‘ఉల్లాస్ అక్షర ఆంధ్రా’ రాత పరీక్షలను కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలోనూ తాగునీటి సౌకర్యం ఉండాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 90,426 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.