News February 6, 2025
MNCL: సింగరేణిలో డిపెండెంట్లకు శుభవార్త

సింగరేణి కంపెనీలో డిపెండెంట్ల వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో పనిచేస్తూ మృతి చెందడంతో పాటు మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల వారసులకు 2018 మార్చి 9 నుంచి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు స్కీమ్ వర్తించనుంది. దీనివల్ల 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణ ప్రయోజనం చేకూరనుండగా రానున్న రోజుల్లోనూ మరింత మందికి లబ్ధి చేకూరుతుంది.
Similar News
News March 7, 2026
కుల్కచర్ల: పాంబండ ఆలయ చరిత్ర తెలుసా

త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం బ్రాహ్మణ హత్యా పాతకాన్ని నివృత్తి చేసుకునే క్రమంలో కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలోని శ్రీ పాంబండ ప్రాంతంలో స్వయంగా శ్రీరాముడే లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని ప్రతీతి. అదే సమయంలో లింగాన్ని అభిషేకించడానికి తన విల్లుతో రాతిశిలపై బాణాన్ని వేయగా గుండం ఏర్పడిందని, పాంబండ ప్రాంతం పాము ఆకారంలో ఉండటంతో పాంబండగా నామకరణం చేశారని ఇక్కడి చరిత్ర చెబుతోంది.
News March 7, 2026
తెలంగాణ సినీ అవార్డులు.. ఉత్తమ నటులు వీరే

☞ ఉత్తమ నటుడు- నాగ చైతన్య (తండేల్)
☞ ఉత్తమ నటి- రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
☞ ఉత్తమ సహాయ నటి: భూమిక
☞ ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాబాయి)
>>>—జ్యూరీ స్పెషల్ అవార్డులు—<<<
☞ ఉత్తమ హీరో : రోషన్ (ఛాంపియన్)
☞ ఉత్తమ నటుడు : చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
☞ ఉత్తమ నటి: అనంతిక (8 వసంతాలు)
News March 7, 2026
చిరంజీవికి తెలంగాణ గద్దర్ అవార్డు-2025

☞ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు- చిరంజీవి
☞ పైడి జయరాజ్ అవార్డు- కమల్‌హాసన్
☞ సినారె అవార్డు- సుద్దాల అశోక్ తేజ
☞ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు-జయసుధ
☞ నాగిరెడ్డి చక్రపాణి అవార్డు-అశ్వనీదత్
☞ రఘుపతి వెంకయ్య అవార్డు-రమేశ్ ప్రసాద్
☞ కాంతారావు అవార్డు- ఆర్.నారాయణమూర్తి
☞ బీఎన్ రెడ్డి అవార్డ్- సింగీతం శ్రీనివాస్


