News February 6, 2025

పనులను త్వరగా పూర్తి చేయాలి: ASF అదనపు కలెక్టర్

image

జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్‌ఛార్జి జిల్లా విద్యాశాఖ అధికారి గమ్మనియల్‌, హెచ్ఎంలతో కలసి సమీక్ష నిర్వహించారు.

Similar News

News July 9, 2025

HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసింది. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా అదనంగా మరో 10శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని SRH యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో విజిలెన్స్ <<16524630>>రిపోర్టు<<>> ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి తీసుకుంది.

News July 9, 2025

అంతర్జాతీయ స్థాయిలో ముత్తుకూరు యువతి సత్తా

image

అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ పోటీల్లో ముత్తుకూరు మండలానికి చెందిన వి. భవాని అద్భుత ప్రతిభ కనబరిచారు. రెండు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా గెలిచారు. ఈ మేరకు ఆమెను బుధవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. వికలాంగులు ఈ విధంగా ప్రపంచ స్థాయిలో ప్రతిభను చాటుకోవడం హర్షనీయమన్నారు.

News July 9, 2025

శ్రీరాంపూర్: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన వారికి రూ.లక్ష

image

సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు CMD బలరాంనాయక్ బుధవారం తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ నుంచి సివిల్స్ ప్రిలిమ్స్‌ పాసై మెయిన్స్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.