News February 6, 2025
అమెరికాలో తెలుగోళ్లు ఎంతమంది ఉన్నారంటే?
అక్రమ వలసదారులను అమెరికా వారి దేశాలకు తిప్పి పంపుతోంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారూ ఉన్నారు. అమెరికాలో తెలుగు వారు 12.30 లక్షలకుపైగా ఉన్నారు. ఎక్కువగా కాలిఫోర్నియా(2 లక్షలు)లో నివసిస్తున్నారు. ఆ తర్వాత టెక్సాస్(1.50 లక్షలు), న్యూజెర్సీ(1.10 లక్షలు), ఇల్లినాయిస్(83 వేలు), వర్జీనియా(78 వేలు), జార్జియా(52 వేలు)లో ఉన్నారు. అక్కడ హిందీ, గుజరాతీ మాట్లాడే వారి తర్వాత తెలుగు మాట్లాడేవారే ఎక్కువ.
Similar News
News February 6, 2025
కొత్త అగాఖాన్ ఎవరంటే..
ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత కరీమ్ అల్-హుసేనీ (49వ అగాఖాన్) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన తదనంతరం 50వ అగాఖాన్‌గా ఆయన తనయుడు రహీమ్(53 ఏళ్లు) అల్-హుసేనీ కొనసాగుతారని అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ప్రకటించింది. అగాఖాన్‌ను మహ్మద్ ప్రవక్తకు ప్రత్యక్ష వారసుడిగా, ఇమామ్‌గా ఇస్మాయిలీ ముస్లింలు భావిస్తారు. 50 తరాలుగా ఆ కుటుంబం తరఫున అగాఖాన్ నియామక సంప్రదాయం కొనసాగుతోంది.
News February 6, 2025
ప్రైవేటు స్కూళ్లు ట్యూషన్ ఫీజు పెంచుకోవచ్చు: కమిషన్
TG: ప్రైవేటు స్కూళ్లు ఏడాదికోసారి ట్యూషన్ ఫీజును పెంచుకోవచ్చని విద్యాకమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ సిఫార్సులివే: విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయుల్లో కలెక్టర్ నేతృత్వంలో కమిటీలుండాలి. ఇవి ఫీజుల్ని నియంత్రిస్తాయి. ఎక్కువ వసూలు చేసే స్కూళ్లకు భారీ జరిమానా విధిస్తారు. ఫీజుల వివరాలను అందరికీ తెలిసేలా వెబ్‌సైట్‌లో పెట్టాలి.
News February 6, 2025
ఎవరెస్టు అధిరోహకులకు నేపాల్ కొత్త నిబంధన
తమ దేశం పరిధిలో ఉన్న హిమాలయ పర్వతాలను అధిరోహించే వారికి నేపాల్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. 8వేల మీటర్ల ఎత్తు దాటి పైకి వెళ్లేవారిని ఒంటరిగా వెళ్లనివ్వమని స్పష్టం చేసింది. కచ్చితంగా సహాయక సిబ్బంది లేదా గైడ్‌తో కలిసి వెళ్లాలని సూచించింది. 8వేల అడుగులు దాటాక పరిస్థితులు కఠినంగా ఉంటాయి. ఆక్సిజన్ అందని కారణంగా పర్వతారోహకులు ప్రాణాపాయంలో పడతారు. ఈ నేపథ్యంలోనే నేపాల్ తాజా నిబంధన తీసుకొచ్చింది.