News February 6, 2025
పెద్దపల్లిలో బాలికల బాలసదనం ప్రారంభం
పెద్దపల్లి జిల్లాలోని అనాథ బాలికలకు ప్రభుత్వం బాల సదనం ప్రారంభించిందని వయోవృద్ధుల శాఖ అధికారి పి.వేణుగోపాలరావు తెలిపారు. 6 నుంచి 18 సంవత్సరాల వయస్సులోపు అనాథ బాలికలను అడ్మిషన్ చేసుకుంటామని తెలిపారు. ఉచిత వసతి, విద్య అందిస్తామని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివించి వివాహం కూడా జరిపిస్తామని తెలిపారు.
Similar News
News February 6, 2025
పిన్నెల్లి అనుచరుణ్ని కోడి మాంసం పట్టించింది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు తురక కిషోర్ సినీ ఫక్కిలో హైదరాబాద్‌లో కొద్దిరోజుల క్రితం పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న కిషోర్ కోడి మాంసం కోసం తన మొబైల్ నుంచి ఫోన్ పే వాడుతూ ఉండడం గుర్తించారు. పోలింగ్ రోజున అల్లర్లు, దాడులు, పాత కేసులు, తీవ్ర నేరారోపణలున్న కిషోర్‌ను హైదరాబాద్ జైపూరి కాలనీలో చికెన్ స్టాల్ వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు.
News February 6, 2025
ఆదిలాబాద్‌లో నూతన మండలం ప్రారంభం!
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన భోరజ్ మండలాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు పాలనాధికారి శ్యామలాదేవి కలిసి ప్రారంభించారు. నూతన మండలానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను త్వరలో పూర్తిచేస్తామన్నారు. సంబంధిత కార్యాలయాల నిర్మాణాలకు నివేదికలు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ పాలనాధికారి మాల్వియా, ఆర్డీఓ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
News February 6, 2025
ఖమ్మం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక
ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే 30 రైళ్లను ఈనెల 10నుంచి 20వరకు రద్దు చేస్తున్నట్లు, ఇంకొన్నింటిని సికింద్రాబాద్- నడికుడి మార్గంలో నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, వారాంతపు రైళ్లను కూడా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు నిర్ణీత తేదీల్లోనే నడుస్తాయని తెలిపారు.