News February 6, 2025
దరఖాస్తు గడువు పెంపు

AP: రాష్ట్రంలో గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు ఎక్సైజ్ శాఖ పొడిగించింది. ఈ నెల 10న డ్రా తీసి లబ్ధిదారుల పేర్లను కలెక్టర్లు ప్రకటిస్తారని వెల్లడించింది. రాష్ట్రంలోని 340 మద్యం దుకాణాలను ప్రభుత్వం గీత కార్మికులకు కేటాయించిన విషయం తెలిసిందే.
Similar News
News March 5, 2026
ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్? సంచలన ఆరోపణలు!

US పొలిటికల్ లీడర్ల హత్యకు కుట్ర చేశాడన్న ఆరోపణలపై 2024లో అరెస్టయిన పాక్ వ్యక్తి ఆసిఫ్ మర్చంట్ బ్రూక్లిన్ సంచలన విషయం బయటపెట్టాడు. ట్రంప్, బైడెన్, నిక్కీ హేలీని చంపేందుకు Iran ఇంటెలిజెన్స్ తనను నియమించుకున్నట్లు తాజాగా కోర్టుకు తెలిపాడు. ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించడంతో వారికి సహకరించానన్నాడు. 2024 JUNEలో రిపబ్లికన్ లీడర్ హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు అనుమానించి ఆసిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
News March 5, 2026
అప్పుడు తగ్గింది ఇప్పుడు నెగ్గడానికేనా?

గతేడాది నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో BJP-JDU కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 243 సీట్లలో BJP 89, JDU 85 చోట్ల గెలిచాయి. మెజార్టీ స్థానాలు దక్కినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాషాయ పార్టీ నితీశ్‌కే సీఎం పదవి ఇచ్చింది. అయితే BJP అప్పుడు వెనక్కి తగ్గింది ఇప్పుడు సీఎం పదవి చేజిక్కించుకొని, రాష్ట్ర రాజకీయాలను శాసించడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 5, 2026
రాజ్యసభకు వెళ్తున్నా: CM నితీశ్ కుమార్

రాష్ట్ర రాజకీయాలను వదిలి రాజ్యసభకు వెళ్తున్నట్లు బిహార్ CM నితీశ్ కుమార్ ప్రకటించారు. ‘రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. అందుకే రాజ్యసభకు వెళ్తున్నా. 2 దశాబ్దాలుగా నాకు మద్దతుగా ఉన్న క్యాడర్, ప్రజలకు నా ధన్యవాదాలు. త్వరలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నారు.


