News February 6, 2025

ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా పతనమైన ఇరాన్ కరెన్సీ

image

అణ్వాయుధ తయారీకి సిద్ధమవుతున్న ఇరాన్ లక్ష్యంగా US అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఒత్తిడి ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక US డాలర్‌తో పోలిస్తే ఆ దేశ కరెన్సీ 8,50,000 రియాల్స్‌కు పతనమైంది. ఇది ఇరాన్ చరిత్రలోనే అత్యల్ప స్థాయి. ఇరాన్ చమురు ఎగుమతులను సున్నాకు తీసుకువచ్చేలా ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆంక్షలు తనకు ఇష్టం లేదని, చర్చలకు రావాలని ఆయన ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

Similar News

News February 6, 2025

ఎవరెస్టు అధిరోహకులకు నేపాల్ కొత్త నిబంధన

image

తమ దేశం పరిధిలో ఉన్న హిమాలయ పర్వతాలను అధిరోహించే వారికి నేపాల్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. 8వేల మీటర్ల ఎత్తు దాటి పైకి వెళ్లేవారిని ఒంటరిగా వెళ్లనివ్వమని స్పష్టం చేసింది. కచ్చితంగా సహాయక సిబ్బంది లేదా గైడ్‌తో కలిసి వెళ్లాలని సూచించింది. 8వేల అడుగులు దాటాక పరిస్థితులు కఠినంగా ఉంటాయి. ఆక్సిజన్ అందని కారణంగా పర్వతారోహకులు ప్రాణాపాయంలో పడతారు. ఈ నేపథ్యంలోనే నేపాల్ తాజా నిబంధన తీసుకొచ్చింది.

News February 6, 2025

APPLY.. రూ.72,000 జీతంతో ఉద్యోగాలు

image

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లిష్ టైపింగ్ వచ్చి ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితి ఉంది. రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లికేషన్లకు చివరి తేది మార్చి 8. జీతం గరిష్ఠంగా రూ.72,000 వరకు ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 6, 2025

సర్వే పేరుతో బీసీలను రేవంత్ పొడిచి పొడిచి చంపారు: లక్ష్మణ్

image

TG: సమగ్ర సర్వే పేరుతో గతంలో KCR ఒక్కరోజులో బీసీల గొంతు కోస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కులగణన పేరిట 50 రోజులపాటు పొడిచి పొడిచి చంపారని BJP MP కె.లక్ష్మణ్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకని విమర్శించారు. బీసీలపై రేవంత్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకే సర్వేలో వారి శాతాన్ని తక్కువచేసి చూపించారని లక్ష్మణ్ ఆరోపించారు.

error: Content is protected !!