News February 6, 2025
చైనా టెలికాం కంపెనీకి యూజర్ల లాగిన్ డేటా
చైనా డీప్‌సీక్‌తో యూజర్ల డేటా భద్రతకు ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. US నిషేధిత చైనా ప్రభుత్వ టెలికాం కంపెనీ(చైనా మొబైల్)తో డీప్‌సీక్‌కు సంబంధాలు ఉన్నాయంటున్నారు. కంప్యూటర్ కోడ్ ద్వారా యూజర్ల లాగిన్ సమాచారాన్ని టెలికాం సంస్థకు పంపుతోందని పేర్కొంటున్నారు. కెనడాకు చెందిన ఫీరూట్ సెక్యూరిటీ సంస్థ తొలుత దీన్ని గుర్తించింది. ఇప్పటికే డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ నిషేధించాయి.
Similar News
News February 6, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ.79,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.270 పెరగడంతో రూ.86,510 పలుకుతోంది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. వివాహాలు ఉండటంతో కొనుగోలుదారులకు ఇది మరింత భారం కానుంది.
News February 6, 2025
‘లైగర్’లో నటించేందుకు అనన్య ఒప్పుకోలేదు: చంకీ పాండే
విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో నటించేందుకు తన కూతురు అనన్య పాండే అసౌకర్యంగా ఫీలైనట్లు ఆమె తండ్రి చంకీ పాండే తెలిపారు. ఆ పాత్రకు ఆమె వయసు సరిపోదని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే తానే ఒప్పించినట్లు వెల్లడించారు. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు కరణ్ జోహర్ ఓ నిర్మాతగా వ్యవహరించారు.
News February 6, 2025
బుమ్రా గాయంపై రోహిత్ UPDATE
స్టార్ పేసర్ బుమ్రా గాయంపై కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతనికి 2 రోజులు స్కాన్స్ జరగాల్సి ఉందన్నారు. అందులో వచ్చిన రిజల్ట్స్‌ను బట్టి ఇంగ్లండ్‌తో మూడో వన్డే, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటంపై క్లారిటీ వస్తుందని ప్రెస్మీట్లో చెప్పారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా NCAలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ENGతో ODI సిరీస్‌కు అతని స్థానంలో వరుణ్‌ను BCCI ఎంపిక చేసింది.