News February 6, 2025

పవన్‌కు స్పాండిలైటిస్.. ఇది ఎలా వస్తుంది?

image

<<15370291>>ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్<<>> స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారు. జీవనవిధానంలో మార్పులు, మెడ దగ్గర దెబ్బ తగలడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్పాండిలైటిస్ వస్తుంది. దీనివల్ల మెడ, వెన్నెముక వద్ద తీవ్రమైన నొప్పి ఉంటుంది. తూలి పడిపోతున్నామనే భావన కలుగుతుంది. వాంతులు రావడం, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. మెడ, భుజాలు, చేతులకు తిమ్మిర్లు, నిద్రలేమి సమస్య ఏర్పడతాయి. వ్యాధి ముదిరితే కండరాలు కృశించి పోయే అవకాశం ఉంది.

Similar News

News March 14, 2026

పవన్ ‘అడవి తల్లి బాట’ వెనుక ప్రత్యేక వ్యూహం!

image

AP: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని JSP చీఫ్ పవన్ ఇవాళ పాడేరు ఏజెన్సీలో నిర్వహించి ‘అడవితల్లి బాట’ చేపట్టారు. ఆయన కొంతకాలంగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిసారించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ సాగుతోంది. 2019లో 7 ST నియోజకవర్గాలను గెల్చుకొని ఏజెన్సీలో YCP పట్టుబిగించింది. 2024లో కూటమి జోరులోనూ 2సీట్లు గెల్చుకుంది. YCPకి చెక్ పెట్టేలా పవన్ తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

News March 14, 2026

రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి!

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఈ నెల 25న పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. BRS నుంచి వచ్చిన జగిత్యాల MLA సంజయ్‌కి పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన పలుమార్లు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ వైరం ముదిరింది. దీనిపై జీవన్ రెడ్డి Way2Newsతో మాట్లాడుతూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను అధిష్ఠానానికి వివరించినా లాభం లేదని వాపోయారు.

News March 14, 2026

నెతన్యాహు చనిపోయారా?

image

ఇరాన్‌తో యుద్ధం వేళ సంచలన ప్రశ్న తెరపైకి వచ్చింది. నెతన్యాహు మృతి చెందారని SMలో ప్రచారం జరుగుతోంది. యుద్ధం గురించి మాట్లాడిన వీడియోను ఆయన నిన్న Xలో షేర్ చేశారు. అందులో నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లున్నాయి. దీంతో ఇది AI వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెతన్యాహు మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఇలా AIతో వీడియో చేసి రిలీజ్ చేశారని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.