News February 6, 2025
రైతును ఆత్మహత్యకు ప్రేరేపించినవారిపై అట్రాసిటీ కేసు
మదనపల్లె మండలం, పిచ్చలవాండ్లల్లెలో రైతు నరచంహులు పొలానికి దారి వదలలేదని రెండు రోజుల క్రితం ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. రైతు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన వారిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ కొండయ్య నాయుడు, తాలూకా సీఐ కళా వెంకటరమణ బుధవారం తెలిపారు. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా, దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో దారి లేకుండాచేసిన వారిపై ఈకేసు అయింది.
Similar News
News February 6, 2025
ఆదిలాబాద్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!
ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో సుమారు 467 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 6, 2025
గజ్వేల్‌లో KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)
GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్దా..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్‌లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.
News February 6, 2025
BREAKING: ఫిరాయింపుల ఎమ్మెల్యేల కీలక నిర్ణయం
TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ అధ్యక్షతన జరిగే సీఎల్పీ సమావేశానికి హాజరుకావొద్దని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇదే విషయమై అసెంబ్లీ సెక్రటరీ ఈ ఎమ్మెల్యేలకు నోటిసులు జారీ చేశారు.