News February 6, 2025
కోనసీమలో బైక్ దొంగలు దొరికారు..!

కోనసీమలో బైకులను అపహరిస్తున్న వారిని అరెస్ట్ చేశామని అమలాపురం డీఎస్పీ SKVD ప్రసాద్ వెల్లడించారు. వీరి నుంచి రూ.9 లక్షల విలువైన 13 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆరుగురు పట్టుబడగా.. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. వారిని జువైనల్ హోంకు తరలించారు. మిగిలిన ముగ్గురిని రిమాండ్‌కు పంపారు. అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు.
Similar News
News November 3, 2025
కుంకుమాది తైలంతో చర్మ సంరక్షణ

చర్మసమస్యలను నివారించడంలో కుంకుమాది తైలం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మాయిశ్చరైజర్, మసాజ్ క్రీమ్‌లతో కలిపి వాడుకోవచ్చు. ముడతలు, నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మొటిమలు ఉన్నవారు దీన్ని వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. బాదం, నువ్వులనూనెతో కలిపి అప్లై చేస్తే సీరంలాగా ఉపయోగపడుతుంది.
News November 3, 2025
మెదక్: రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

ఈ నెల 3 నుంచి 30 వరకు మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.
News November 3, 2025
చిరకాల విజయం తర్వాత కాబోయే భర్తతో స్మృతి

ప్రపంచకప్ విజయం తర్వాత భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన కాబోయే భర్త, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో కలిసి కప్పును పట్టుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఈనెలలోనే వీరిద్దరూ <<18043744>>పెళ్లి<<>> చేసుకోనున్నారు. కెరీర్‌లో అత్యున్నత విజయాన్ని సాధించిన ఈ సంతోష క్షణాన్ని ప్రియమైన వ్యక్తితో పంచుకోవడం అద్భుతంగా ఉందని అభిమానులు కొనియాడుతున్నారు.


