News February 6, 2025
త్రివేణీ సంగమంలో నంద్యాల ఎంపీ పుణ్య స్నానం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఇక్కడ పవిత్ర స్నానం ఆచరించడం తన పూర్వ జన్మ సుకృతం అని ఆమె తెలిపారు. అక్కడ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈ మహా కుంభమేళాకు జిల్లా నుంచి సైతం భక్తులు తరలివెళ్తున్నారు.
Similar News
News February 6, 2025
జగిత్యాల ఆర్టీసీ DMను సన్మానించిన MD సజ్జనార్
జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత కొత్త బస్టాండులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ మహిళ ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన డిపో మేనేజర్ ఆ మహిళకు CPR చేసి సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె సేవలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్ బస్ భవన్‌లో డీఎం సునీతను సన్మానించారు. ఈ సందర్భంగా డీఎంను డిపో ఉద్యోగులు అభినందించారు.
News February 6, 2025
‘భక్త ప్రహ్లాద’కు 93 ఏళ్లు
తెలుగులో తొలి టాకీ సినిమాగా గుర్తింపు పొందిన ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి 93 ఏళ్లు పూర్తయ్యాయి. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రూ.18 వేలతో 18 రోజుల్లోనే తెరకెక్కించారు. అప్పటివరకు మూకీ చిత్రాలకే అలవాటైన జనాలకు ఇది కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెను మార్పులు చోటుచేసుకొని అంతర్జాతీయ వేదికపై సత్తాచాటే స్థాయికి చేరుకున్నాయి.
News February 6, 2025
స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్
ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. CTకి 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న అతడు అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 71 వన్డేలు ఆడి 1,495 పరుగులు చేశారు. ఒక సెంచరీతో పాటు 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. మొత్తం 48 వికెట్లు తీశారు.