News February 6, 2025
పార్వతీపురం: ‘డీ – వార్మింగ్‌డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన జరగనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమ బ్యానర్‌ను కలెక్టర్, వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న డీ-వార్మింగ్ డే, 17న మాప్ అప్‌డే కార్యక్రమాలు జరగనున్నాయని అన్నారు.
Similar News
News December 26, 2025
KTR, హరీశ్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలని నాగార్జునకు లేఖ

TG: KTR, హరీశ్‌రావులను బిగ్‌బాస్‌లోకి తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ హోస్ట్ నాగార్జునకు లేఖ రాశారు. రాజకీయ నటులుగా వీరు పేరు ప్రఖ్యాతులు పొందారని, అబద్ధాలు ఆడి మోసం చేయడంలో వీరికి వీరే సాటి అని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దర్నీ తీసుకుంటే వచ్చే సీజన్‌లో రేటింగ్ అమాంతం పెరుగుతుందన్నారు. దీంతో తెలంగాణ ప్రజలకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని లేఖలో పేర్కొన్నారు.
News December 26, 2025
తుంగతుర్తి: మంత్రి ఉత్తమ్, భట్టిని కలిసిన గుడిపాటి నరసయ్య

కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య శుక్రవారం మంత్రి ఉత్తమ్, భట్టి విక్రమార్కను ప్రజా భవన్‌లో కలిశారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య ఎన్నికైన తర్వాత వారిని కలిశారు. మంత్రులు గుడిపాటికి శుభాకాంక్షలు తెలిపారు.
News December 26, 2025
జగన్ ట్వీట్‌తో రంగా అభిమానుల్లో కొత్త చర్చ!

AP: వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా YCP చీఫ్ జగన్ ప్రత్యేకంగా <<18674822>>ట్వీట్<<>> చేయడం చర్చకు దారితీసింది. రంగా కుమారుడు రాధా YCPని వీడి గతంలో TDPలో చేరారు. తాజాగా కుమార్తె ఆశాకిరణ్ యాక్టివ్ అయ్యారు. భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని ఓసారి ఆమెను మీడియా అడగ్గా రాధారంగా మిత్రమండలి సలహాతో నడుస్తానన్నారు. ఆమెను పార్టీలో చేర్చుకోవాలని YCP ఆసక్తితో ఉందా? అనే సందేహాలు రంగా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.


