News February 6, 2025
87 మద్యం షాపులకు ఒక్క దరఖాస్తూ లేదు

AP: కల్లు గీత కులాలకు ప్రభుత్వం ప్రకటించిన మద్యం షాపుల పాలసీకి స్పందన కరువైంది. 339 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే నిన్నటికి 730 దరఖాస్తులే వచ్చాయి. అందులో 87 షాపులకు ఒక్కరు కూడా అప్లై చేయలేదు. దీంతో ఎక్సైజ్ వర్గాలు షాకయ్యాయి. ప్రభుత్వం 10% మార్జిన్ మాత్రమే ఇస్తుండటం, ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. కాగా దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించారు.
Similar News
News March 11, 2026
ఫిరాయింపు MLA కేసులో క్లీన్ చిట్.. KTR ఫైర్

TG: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ <<19352106>>క్లీన్ చిట్<<>> ఇవ్వడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. ‘కాంగ్రెస్ బీఫామ్‌పై MPగా పోటీ చేసిన వారికే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమే. అధికార పార్టీ కోసం రాజ్యాంగ వ్యవస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు’ అని KTR హెచ్చరించారు.
News March 11, 2026
అంగీకారంతో జరిగితే దాన్ని రేప్ అనలేం: కర్ణాటక హైకోర్టు

అంగీకారంతో కొన్నేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉండి ఆపై పెళ్లికి నిరాకరిస్తే రేప్‌గా పరిగణించలేమని కర్ణాటక HC స్పష్టం చేసింది. ‘‘చట్టం ప్రకారం ‘హార్ట్‌బ్రేక్’ నేరం కాదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పైగా విదేశాల్లో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే అది మోసం కిందకు రాదంటూ నిందితుడిపై కేసును కొట్టివేసింది. కేవలం పెళ్లి చేసుకోలేదన్న కారణంతో అంగీకారంతో కూడిన బంధాన్ని రేప్‌గా మార్చలేమని కోర్టు తేల్చిచెప్పింది.
News March 11, 2026
పొద చిక్కుడులో కాయతొలిచే పురుగు నివారణ

పొద చిక్కుడు పూత, కాయ దశల్లో కాయతొలిచే పురుగు ఆశించి కాయలోని పదార్థాలను తినేస్తుంది. దీని వల్ల కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. కాయతొలిచే పురుగు నివారణకు ఫ్లూబెండమైడ్ 39.35% ఎస్.సి. 60 మి.లీ. లేదా క్లోరంత్రానిలిప్రోల్ 18.5% ఎస్.సి. 60 మి.లీ. లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 60 మి.లీ.తో పాటు జిగురు 100 మి.లీ. కలిపి ఎకరానికి సరిపడా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.


