News February 6, 2025
విజయవాడ రైల్వే డివిజన్ ఇకపై ఆ జోన్ పరిధిలోకి

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిని రైల్వేశాఖ తాజాగా ఖరారు చేసింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న విజయవాడ డివిజన్ ఇకపై దక్షిణ కోస్తా రైల్వే జోన్ కిందకి రానుంది. అలాగే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి(ఇబ్రహీంపట్నం మండలం)- మోటుమర్రి సెక్షన్ విజయవాడ డివిజన్ కిందకి రానున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
Similar News
News March 16, 2026
గుంటూరు: మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ఏదీ?

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ రైతు సంఘం నాయకులు PGRSలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు కేవలం రూ.1,600కే కొనుగోలు చేస్తున్నారని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల రైతులు ఎకరాకు రూ.24 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులను ఆదుకోవాలన్నారు.
News March 16, 2026
HNK: గ్రామాల్లో వంద శాతం పన్నుల వసూలు చేపట్టాలి: కలెక్టర్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలలో పన్నుల వసూళ్లను వేగవంతం చేసి వంద శాతం సేకరించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. గ్రామాల్లో చాటింపులు నిర్వహించి ప్రజలకు పన్నుల వసూలపై అవగాహన కల్పించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.
News March 16, 2026
అందుబాటులో ఉండండి.. కార్యదర్శులకు కలెక్టర్ ఆదేశం

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు రోజూ ఉదయం 9:30లోపు విధులకు హాజరై, ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడా అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చూడాలని ఆమె సూచించారు.


