News March 19, 2024
నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులపాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News April 3, 2026
NZB: ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి: కవిత

ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలని, ఇందు కోసం అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఫీజుల పెంపుతో ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల తల్లితండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఒకేసారి 30-40 శాతం ఫీజులు పెంచి తల్లితండ్రులను ఆగం చేస్తున్నారన్నారు. ఏటా 8 శాతానికి మించి ఫీజు పెంచటాన్ని ప్రభుత్వం నిరోధించాలన్నారు.
News April 2, 2026
నిజామాబాద్: విజయవంతమైన గ్రామ, వార్డు సభలు

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామపంచాయతీలు,146 వార్డుల్లో నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసి, అవసరమైన సౌకర్యాలు కల్పించారు.
News April 2, 2026
NZB: గ్రామ సభలో CM ఫోటో లేదు

సాధారణంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, గ్రామసభలు జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల ఫోటోలు ఉండటం ప్రొటోకాల్‌లో భాగం. అయితే గురువారం నగరంలోని 15వ డివిజన్‌లోని అర్సపల్లిలో నిర్వహించిన గ్రామసభ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంతో పాటు MIM చీఫ్ అసదుద్దీన్ ఫోటో ఉండడంతో అది స్థానిక రాజకీయ వర్గాల్లో, ప్రతిపక్షాల మధ్య వివాదానికి దారితీసింది.


