News February 6, 2025
చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల మృతి

లారీ ఢీకొని అన్నాచెల్లెళ్లు మృతి చెందిన విషాద ఘటన విజయపురం మండలంలో జరిగింది. నిండ్ర(మం), అగరం పేట గ్రామానికి చెందిన రవి(48), KVB పురం(మం), కళత్తూరు గ్రామానికి చెందిన మంజుల (44) అన్నాచెల్లెళ్లు. వారు పెద్ద అక్క దేశమ్మ ఇంటికి బైకుపై వెళ్లారు. తిరిగి ప్రయాణంలో తెల్లగుంట వద్ద లారీ ఢీకొని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదుచేశారు.
Similar News
News March 22, 2026
23 నుంచి జనగణన ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ: DRO

సోమవారం నుంచి జనగణన చేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు డీఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 2027 సం. జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు శిక్షణ కోసం సంబంధిత అధికారులు తప్పక హాజరు కావాలని డీఆర్ఓ సంబంధిత అధికారులను ఆదేశించారు.
News March 22, 2026
23 నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు: కలెక్టర్

మార్చి 23వ తేదీ నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని ఇరువారం దగ్గర తాత్కాలిక విద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ప్రవేశ ప్రక్రియలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సందేహాలకు 8919820152 / 9476007488 నంబర్లను సంప్రదించాలని కోరారు.
News March 22, 2026
చిత్తూరు జిల్లా SP వినతి

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు SP ఆఫీసు వెల్లడించింది. ఉ.10:30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాధితులకు తెలిపారు.


