News February 6, 2025

మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

image

TG: రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 21,45,330 మందికి ₹1,126Cr జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03లక్షల మందికి ₹6K చొప్పున లబ్ధి చేకూర్చినట్లు తెలిపింది. త్వరలోనే 2, 3 ఎకరాల రైతులకు నిధులు జమ చేస్తామంది. కాగా MLC ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్‌గోయింగ్ స్కీమ్ కింద ఈసీ అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. మరి మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

Similar News

News February 6, 2025

‘భక్త ప్రహ్లాద’కు 93 ఏళ్లు

image

తెలుగులో తొలి టాకీ సినిమాగా గుర్తింపు పొందిన ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి 93 ఏళ్లు పూర్తయ్యాయి. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రూ.18 వేలతో 18 రోజుల్లోనే తెరకెక్కించారు. అప్పటివరకు మూకీ చిత్రాలకే అలవాటైన జనాలకు ఇది కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో పెను మార్పులు చోటుచేసుకొని అంతర్జాతీయ వేదికపై సత్తాచాటే స్థాయికి చేరుకున్నాయి.

News February 6, 2025

స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

image

ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. CTకి 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న అతడు అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 71 వన్డేలు ఆడి 1,495 పరుగులు చేశారు. ఒక సెంచరీతో పాటు 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. మొత్తం 48 వికెట్లు తీశారు.

News February 6, 2025

బీఆర్ఎస్ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలి: షబ్బీర్ అలీ

image

TG: కులగణన సర్వే నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలన్నారు. ప్రజల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. సర్వే పేరుతో రూ.100 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. విచారణ జరిగితే అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

error: Content is protected !!