News February 6, 2025

విశాఖ: మొన్న మూడు.. నిన్న నిల్..!

image

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా నిన్న బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిటింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు తెలిపినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది.

Similar News

News February 6, 2025

గోపాలపట్నంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

గోపాలపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కొత్తపాలెం ఆదర్శనగర్‌కు చెందిన ఉమ్మి వెంకట బాలాజీ(26)గా గుర్తించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం షిప్ యార్డులో అప్రెంటీస్ చేస్తున్నాడు. ఘటనా స్థలానికి ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ అప్పలనాయుడు చేరుకుని విచారణ ప్రారంభించారు.

News February 6, 2025

విశాఖ: రూ.1.50లక్షల జీతమని ముంచేశారు..! 

image

విదేశాల్లో ఎక్కువ జీతంతో ఉద్యోగాల పేరుతో విశాఖలో నయా మోసం వెలుగులోకి వచ్చింది. మద్దిలపాలెంలో ఓ కన్సల్టెన్సీ నెలకు రూ.1.50లక్షల జీతం ఇస్తామని నమ్మించి విదేశాలు పంపారు. అక్కడికి వెళ్లాక నియామక పత్రాలు నకిలీవని తేలడంతో గతేడాది జూలైలో పోలీసులు చొరవతో విశాఖ చేరుకున్నారు. సుమారు 10మంది నుంచి రూ.66.98లక్షల వసూలు చేసి నిందితులు పరారైనట్లు బాధితులు ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News February 6, 2025

విశాఖ రానున్న మాజీ ఉపరాష్ట్రపతి

image

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం విశాఖ రానున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌కు గురువారం ఉదయం 8:15కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాగర్ నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 10 వరకు విశాఖలోనే ఉండి పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 8:40కి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్లనున్నట్లు వెంకయ్య నాయుడి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

error: Content is protected !!