News February 6, 2025

MBNR: అన్నం ముద్ద ఇరుక్కుని మహిళ మృతి

image

అన్నం తింటుండగా ముద్ద గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందిన ఘటన MBNR జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో జరిగింది. స్తానికులు తెలిపిన వివరాల మేరకు.. నవాబ్‌పేటకు చెందిన మాడమోని జయమ్మ(57) నిన్న రాత్రి భోజనం చేస్తూ ఉండగా ముద్ద ఇరుక్కుంది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు MBNRలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయింది.

Similar News

News January 21, 2026

ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యం: భద్రాద్రి కలెక్టర్

image

ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జల్ శక్తి అంకల్ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ఛాంబర్‌లో జిల్లా స్థాయి తాగునీటి సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

News January 21, 2026

SONY ఠీవీ.. ఇక ఇంటికి రాదా?

image

TV బ్రాండ్ అనగానే విన్పించే SONY సంస్థ TCLతో ఒప్పందం చేసుకుంది. దీంతో ఇకపై సోనీ బ్రాండ్ టీవీలు మార్కెట్లోకి రావా? అనే సందేహం నెలకొంది. అయితే SONY, BRAVIA పేర్లతోనే TCL టెలివిజన్ సెట్స్ తయారు చేయనుంది. భాగస్వామ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలో జపాన్ దిగ్గజానికి 49% వాటా, చైనా ప్రభుత్వం భాగస్వామిగా గల TCLకు 51% షేర్ ఉంటాయి. అయితే ప్రొడక్షన్ మారడంతో క్వాలిటీ తదితరాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.

News January 21, 2026

SRD: సైన్స్ ఫెయిర్‌కు పోటెత్తిన విద్యార్థులు

image

సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌లో జరుగుతున్న దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శన(SISF-2026) మూడో రోజు ఉత్సాహంగా సాగింది. ఆరు రాష్ట్రాల విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. బుధవారం 7 జిల్లాల నుంచి సుమారు 10,173 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని భావి శాస్త్రవేత్తల ప్రతిభను కొనియాడారు.