News February 6, 2025
కాలేజీ బస్సు ఢీకొని చిన్నారి మృతి

కాలేజీ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన తొండంగి మండలం సీతారాంపురంలో బుధవారం జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె సుకన్య(3) మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి చనిపోయిందని గ్రామస్థులు, బంధువులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News November 2, 2025
‘ఎవరు బాధ్యులు?’ మెట్పల్లిలో అభివృద్ధి పనులకు ‘బ్రేక్’

మెట్పల్లి పట్టణంలో వెజ్-నాన్ వెజ్ మార్కెట్, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలలు, డిగ్రీ కళాశాల వంటి కీలక నిర్మాణ పనులన్నీ నిధుల లేమితో నిలిచిపోయాయి. దీనిపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ‘నిధులు వస్తే మా క్రెడిట్’ అని చెప్పుకునే పార్టీలు, పనులు నిలిచిపోవడానికి ఎవరు బాధ్యులు? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదనే చర్చ మెట్పల్లిలో జోరుగా సాగుతోంది.
News November 2, 2025
గుడ్న్యూస్.. జెప్టోలో ఆ ఛార్జీలు ఉండవు!

క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డర్లపై హ్యాండ్లింగ్ ఫీజులు, సర్జ్, రెయిన్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఇకపై ₹99 కంటే ఎక్కువున్న ఆర్డర్లను ఉచితంగా డెలివరీ చేయనుంది. ‘10 నిమిషాల డెలివరీ’ మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ₹99 కంటే తక్కువ ఉన్న ఆర్డర్లపై మాత్రం ₹30 డెలివరీ ఫీజు వసూలు చేయనుంది.
News November 2, 2025
NRPT: పెళ్లై నెలకాలేదు.. యువకుడి ఆత్మహత్య..!

పెళ్లై నెలరోజులు గడవకముందే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి మిత్రుల వివరాల ప్రకారం.. నారాయణపేట(D) కోస్గి మం. నాచారంకి చెందిన రాములు(25) HYDలోని ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నెలరోజుల కిందే వివాహం జరిగ్గా.. ఈ మధ్యే భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. ఏమైందో తెలీదుకాని నిన్నరాత్రి అక్కడే చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతికిగల కారణాలు తెలియాల్సి ఉంది.


