News February 6, 2025

ఉంగుటూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. హనుమాన్ జంక్షన్ వెళ్తున్న లారీ నాచుగుంట వచ్చే సరికి జాయింట్ వీల్ విరిగిపోయింది. దీంతో ఏమైందని చూసేందుకు డ్రైవర్ లారీ కిందకు వెళ్లారు. ఇంతలో పైనాపిల్ లోడుతో ఉత్తరప్రదేశ్ వెళుతున్న ఓ కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ కింద ఉన్న డ్రైవర్, పక్కనే ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. 

Similar News

News March 22, 2026

అనకాపల్లి : సీఎం చంద్రబాబు సభకు 400 బస్సులు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 23న ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అనంతరం నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలో అన్ని గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు 400 బస్సులను కేటాయించారు. ఒక్కొక్క బస్సులో 60 మందిని తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. వీరందరికి బస్సు ఎక్కేముందు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తామన్నారు. తిరిగి ప్రయాణంలో కూడా ఫుడ్ సరఫరా చేస్తామన్నారు. బస్సులు సోమవారం ఉదయం 11 గంటలకు బయలుదేరుతాయి.

News March 22, 2026

కాబోయే తండ్రుల్లోనూ ‘ప్రెగ్నెన్సీ’ లక్షణాలు

image

గర్భిణుల్లో వాంతులు, అలసట, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, బరువు పెరగటం సహజం. కానీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొందరు భర్తల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే Couvade సిండ్రోమ్ అంటారు. భాగస్వామితో బలమైన భావోద్వేగ అనుబంధం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20% మందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. కొందరు పురుషుల్లో హార్మోన్ల మార్పులూ జరుగుతాయని పేర్కొంటున్నారు.

News March 22, 2026

కడప: MP మహేశ్‌కు మద్దతుగా బ్యానర్లు

image

కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు MP పుట్టా మహేశ్ యాదవ్‌కి మద్దతుగా కడప జిల్లాలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. మైదుకూరు నియోజకవర్గం మొర్రాయిపల్లి రోడ్డులో న్యాయం నిలుస్తుంది, నిజాయితి గెలుస్తుంది.. వీ స్టాండ్ విత్ పుట్టా మహేశ్, ఇట్లు చాపాడు మండల ప్రజలు అనే వాక్యాలతో బ్యానర్‌లో రాసి ఉంది.