News February 6, 2025

ఎవరెస్టు అధిరోహకులకు నేపాల్ కొత్త నిబంధన

image

తమ దేశం పరిధిలో ఉన్న హిమాలయ పర్వతాలను అధిరోహించే వారికి నేపాల్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. 8వేల మీటర్ల ఎత్తు దాటి పైకి వెళ్లేవారిని ఒంటరిగా వెళ్లనివ్వమని స్పష్టం చేసింది. కచ్చితంగా సహాయక సిబ్బంది లేదా గైడ్‌తో కలిసి వెళ్లాలని సూచించింది. 8వేల అడుగులు దాటాక పరిస్థితులు కఠినంగా ఉంటాయి. ఆక్సిజన్ అందని కారణంగా పర్వతారోహకులు ప్రాణాపాయంలో పడతారు. ఈ నేపథ్యంలోనే నేపాల్ తాజా నిబంధన తీసుకొచ్చింది.

Similar News

News February 6, 2025

న్యూడ్ వీడియోల కేసు.. వారికి నోటీసులు!

image

అమ్మాయిల న్యూడ్ వీడియోల కేసు కొత్త మలుపు తీసుకుంటోంది. మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరిగిందని నిన్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు చర్యలకు దిగినట్లు సమాచారం. వీడియోలో ఉన్న సినీ ప్రముఖులు, ఇతరులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌ను పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపించారు.

News February 6, 2025

ఘోరం.. భర్త ఇంటిని అమ్మి ప్రియుడితో భార్య పరార్

image

భర్త కిడ్నీని అమ్మి ప్రియుడితో <<15341180>>పారిపోయిన ఘటన<<>> మరువకముందే అదే తరహాలో మరో ఉదంతం బయటకొచ్చింది. తమిళనాడు కన్యాకుమారి(D)లో బెంజమిన్(47), సునీత(45) దంపతులు. భర్త సౌదీలో పనిచేస్తుండగా, ఇంటివద్దే ఉన్న భార్య మరొకరితో సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్త ఇంటిని అమ్మేసి డబ్బుతో పారిపోయింది. దీంతో భర్త సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News February 6, 2025

జాతీయవాదం సరికాదు: ఇన్ఫీ నారాయణ

image

పేదల సంక్షేమం కోసం పల్లెటూర్లకు వెళ్లి పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి విద్యార్థులకు పిలుపునిచ్చారు. చెన్నైలోని సాయి యూనివర్సిటీ కాన్వొకేషన్‌ ప్రోగ్రామ్‌లో మాట్లాడారు. దేశభక్తి కోసం జాతీయవాదాన్ని వదిలేయాలని సూచించారు. ‘దేశ, ప్రపంచ ప్రజలను మెరుగుపరిచేందుకు ఎంచుకున్న రంగంలో మనస్ఫూర్తిగా పనిచేయడమే దేశభక్తి. ఇంటర్ కనెక్ట్ అయిన ఈ ప్రపంచంలో జాతీయవాదాన్ని ఫాలో అవ్వడం సరికాదు’ అని ఆయన అన్నారు.

error: Content is protected !!