News February 6, 2025
తిరుపతి: టీచర్‌పై పోక్సో కేసు

నారాయణవనంలో టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది. వెంకటరమణ నారాయణవనం(M), ఎరికంబట్టులోని పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన మిట్టనైనారు కండ్రికకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అక్కడ నలుగురు విద్యార్థునుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారు తల్లిదండ్రులకు వెళ్లి చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజశేఖర్ పేర్కొన్నారు.
Similar News
News April 17, 2026
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర ఇదే

మహిళా రిజర్వేషన్ ప్రస్తావన రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలోనే (1946-49) వచ్చినా అది సాధ్యపడలేదు. 1996లో దేవెగౌడ ప్రభుత్వం 33% రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టగా గందరగోళం నెలకొంది. 1998-2003 మధ్య నాలుగుసార్లు సేమ్ సీన్ రిపీటైంది. 2010లో మళ్లీ UPA ప్రభుత్వం మొదట రాజ్యసభలో ఆమోదించినా ఆ తర్వాత జాప్యం వల్ల అమలులోకి రాలేదు. 2023లో ఈ బిల్లుకు ఆమోదం లభించగా దీనికి సవరణలు చేపట్టి కేంద్రం మరోసారి తీసుకొచ్చింది.
News April 17, 2026
NTR జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. NTR జిల్లాలో మొత్తం 8,35,515 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 4,06,803 మంది ఉండగా, మహిళలు 4,28,680 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 32 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News April 17, 2026
HYD: 3 రక్షణ కమిటీలు.. ఆక్రమణదారుల కోసమేనా? (3)

చెరువులను కాపాడతామని 2018లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసిన సర్కారు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. FTL మార్కింగ్, ఫెన్సింగ్ అంతా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్‌లో బడా బాబులు ఓ చెరువును మింగేస్తుంటే అధికారులు ‘పరిశీలిస్తాం’ అంటూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కట్టడాలు కూల్చే ధైర్యం అధికారులకు లేదా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? దీనిపై దర్యాప్తు జరగాల్సిందే!


