News February 6, 2025

కరీంనగర్‌లో రేపు జాబ్ మేళా..!

image

కరీంనగర్‌లోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(ఆటానమస్)లో శుక్రవారం జాబ్ మేళా జరగనుందని ప్రిన్సిపల్ ప్రొ.డీ.వరలక్ష్మీ తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుందని.. ఈ అవకాశాన్ని స్థానికంగా ఉండే ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ జాబ్ డ్రైవ్‌లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూకి అవసరమయ్యే అన్ని డాక్యుమెంట్స్‌ను వెంట తెచ్చుకోవాలన్నారు.

Similar News

News March 15, 2026

నిమ్మనపల్లె: ‘అతని చదువుకు పేదరికం తలవంచింది’

image

ఏడాది వయసులో తల్లితండ్రులను కోల్పోయి అక్క, మేనమామ ఇంట్లో పెరిగాడు. బాల్యం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాడు. ఉన్నత చదువులకు పేదరికం అడ్డొచ్చినా.. వెనకడుగు వేయలేదు. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహం, అతని సంకల్పం ముందు పేదరికం తలవచింది. UPSC సివిల్ సర్వీసెస్-2025 ఫలితాల్లో అన్నమయ్య (D) నిమ్మనపల్లె (M) అగ్రహారానికి చెందిన గోగుల రాజశేఖర్ 920వ ర్యాంకు సాధించాడు.

News March 15, 2026

యుద్ధం.. మరో జలసంధి క్లోజ్?

image

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ‘బాబ్ ఎల్-మండేబ్’ జలసంధిని హౌతీలు మూసివేసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే హార్ముజ్ మూతపడటంతో గ్యాస్, చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ఈ మార్గం కూడా క్లోజ్ అయితే 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది. యూరప్ నుంచి సూయెజ్ కెనాల్ మీదుగా ఇండియా సహా ఆసియాకు వచ్చే నౌకలన్నీ నిలిచిపోతాయి. ఫలితంగా ఇంధన, వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.

News March 15, 2026

పుంగనూరు: కలిసి పుట్టారు.. కలిసి మరణించారు

image

పుంగనూరు పట్టణ త్యాగరాజు వీధిలో బైకు నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరి ఆడక నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కవలలు చరిత, చందన మృతి చెందారు. వీరితోపాటు అన్న కార్తీక్ కూడా మరణించాడు. ఒకేసారి పుట్టి, ఒకేసారి మృతి చెందడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి.