News February 6, 2025

అనకాపల్లి: మొన్న మూడు.. నిన్న నిల్..!

image

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా నిన్న బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిటింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు ఇచ్చినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది.

Similar News

News February 6, 2025

మాజీ మంత్రి హరీశ్ రావును కలిసిన సత్యవతి రాథోడ్

image

మాజీ మంత్రి హరీశ్ రావును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తనకు శాసనమండలిలో బీఆర్ఎస్ విప్‌గా అవకాశం కల్పించినందుకు గాను సత్యవతి రాథోడ్ హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల సమస్యలపై శాసనమండలిలో గళం విప్పాలని హరీశ్ రావు సత్యవతి రాథోడ్‌కు సూచించారు.

News February 6, 2025

కొండపాక: సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

కొండపాక మండలంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని బియ్యం, నిత్యావసర వస్తువులు, వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులకు సూచించారు.

News February 6, 2025

కందుకూరు YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులు వీరే..

image

కందుకూరు నియోజకవర్గ YCPఅనుబంధ విభాగాల అధ్యక్షులను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. యువజన విభాగం: మద్దసాని నవీన్ కృష్ణ, మహిళా విభాగం: Tఆదిలక్ష్మి, రైతు విభాగం: N చంద్రమౌళి, లీగల్ సెల్: కొత్తూరి హరికోటేశ్వరరావు, SCసెల్: దగ్గుమాటి కోటయ్య, STసెల్: చేవూరి శ్రీనివాసమూర్తి, గ్రీవెన్స్ సెల్: Yనాగభూషణం, మున్సిపల్ వింగ్: పిడికిటి శంకర్, బూత్ కమిటీస్: కోడూరి వసంతరావు తదితరులు నియమితులయ్యారు.

error: Content is protected !!