News February 6, 2025

కొత్త అగాఖాన్ ఎవరంటే..

image

ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత కరీమ్ అల్-హుసేనీ (49వ అగాఖాన్) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన తదనంతరం 50వ అగాఖాన్‌గా ఆయన తనయుడు రహీమ్(53 ఏళ్లు) అల్-హుసేనీ కొనసాగుతారని అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ప్రకటించింది. అగాఖాన్‌ను మహ్మద్ ప్రవక్తకు ప్రత్యక్ష వారసుడిగా, ఇమామ్‌గా ఇస్మాయిలీ ముస్లింలు భావిస్తారు. 50 తరాలుగా ఆ కుటుంబం తరఫున అగాఖాన్ నియామక సంప్రదాయం కొనసాగుతోంది.

Similar News

News February 6, 2025

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఈయనే!

image

ఫ్రాన్స్‌కు చెందిన టిబెటన్ బౌద్ధ సన్యాసి మాథ్యూ రికార్డ్‌‌ని ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా గుర్తించారు. మాథ్యూపై విస్కాన్సిన్ యూనివర్సిటీ న్యూరో సైంటిస్టులు అతని పుర్రెకు 256 సెన్సార్లు బిగించి 12 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఆయన ధ్యానం చేసినప్పుడు బ్రెయిన్ చార్టుల నుంచి గామా తరంగాల ఉత్పత్తి స్థాయిని చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

News February 6, 2025

మా కలలన్నీ ఛిద్రమయ్యాయి: అక్రమ వలసదారుల కన్నీళ్లు

image

104మంది అక్రమ వలసదారుల్ని US తిప్పి పంపిన సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లేందుకు వారు పడిన బాధలు గుండెల్ని పిండుతున్నాయి. ‘చట్టప్రకారం అమెరికా తీసుకెళ్తామని ఏజెంట్ రూ.30 లక్షలు తీసుకున్నాడు. కానీ చట్ట విరుద్ధంగా బోర్డర్ దాటించాడు. దారిలో ఎన్నో ఘోరాలు చూశాం. ఎంతోమంది చనిపోయారు. ఎక్కడైతే బయలుదేరామో ఇప్పుడు తిరిగి అక్కడికే చేరాం. మా కలలన్నీ ఛిద్రమయ్యాయి’ అంటూ వారు కంటనీరు పెట్టుకుంటున్నారు.

News February 6, 2025

న్యూడ్ వీడియోల కేసు.. వారికి నోటీసులు!

image

అమ్మాయిల న్యూడ్ వీడియోల కేసు కొత్త మలుపు తీసుకుంటోంది. మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీ జరిగిందని నిన్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు చర్యలకు దిగినట్లు సమాచారం. వీడియోలో ఉన్న సినీ ప్రముఖులు, ఇతరులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్‌ను పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపించారు.

error: Content is protected !!