News February 6, 2025
ఖమ్మం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే 30 రైళ్లను ఈనెల 10నుంచి 20వరకు రద్దు చేస్తున్నట్లు, ఇంకొన్నింటిని సికింద్రాబాద్- నడికుడి మార్గంలో నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, వారాంతపు రైళ్లను కూడా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు నిర్ణీత తేదీల్లోనే నడుస్తాయని తెలిపారు.
Similar News
News January 26, 2026
వైద్య సేవలకు గుర్తింపు.. డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్ గౌడ్‌కు పురస్కారం

ఖమ్మం జిల్లా ఆరోగ్య శాఖలో విశేష సేవలు అందించిన డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కేసగని రాజశేఖర్ గౌడ్‌ను ఉత్తమ జిల్లా స్థాయి అధికారి పురస్కారం వరించింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన చూపిన నిబద్ధతను అధికారులు కొనియాడారు. పురస్కారం పట్ల పలువురు వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
News January 26, 2026
ఖమ్మం: జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు: కలెక్టర్ అనుదీప్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసిన కలెక్టర్ అనుదీప్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సందేశమిచ్చారు. సన్నవడ్లు పండించిన 39,475 రైతులకు రూ.113.57 కోట్లు బోనస్ జమ, 9.30 లక్షల గ్యాస్ సిలిండర్లకు రూ.26.31 కోట్లు సబ్సిడీ, 2,46,855 గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు చేరవేశామని వెల్లడించారు.
News January 25, 2026
ఖమ్మం: రేపు జాతీయ పతాకం ఆవిష్కరించనున్న కలెక్టర్

ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా కలెక్టర్ అనుదీప్ పాల్గొంటారని జిల్లా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా రేపటి గణతంత్ర దినోత్సవ వేడుకల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణ. 9:30కు కలెక్టర్ ప్రసంగం. 9:50కు సాంస్కృతిక కార్యక్రమాలు. 10:45కు ప్రశంస పత్రాల పంపిణీ అనంతరం కలెక్టర్ స్టాళ్లను సందర్శిస్తారని పేర్కొన్నారు.


