News March 19, 2024
IPLలో ప్రత్యర్థులపై విరుచుకుపడిన కోహ్లీ
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ IPLలో అద్భుతంగా ఆడుతూ ప్రత్యర్థి టీమ్‌కు చుక్కలు చూపిస్తుంటారు. అయితే ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఇప్పటివరకు 237 మ్యాచ్‌లు ఆడిన కింగ్.. 7263 పరుగులు చేశారు. కాగా ఏయే జట్టుపై కోహ్లీ ఎన్ని పరుగులు చేశారో తెలుసుకుందాం. DCపై 1030 రన్స్, CSK – 985, KKR- 861, PBKS- 861, MI-852, SRH-669, RR-618, GT-232, LSGపై 117 పరుగులు చేశారు.
Similar News
News January 8, 2025
AAG ఏం చెబుతారు..?
TG: ACB విచారణకు లాయర్‌ను అనుమతించాలన్న <<15097073>>KTR<<>> పిటిషన్‌పై ఈ సాయంత్రం హైకోర్టు తుది నిర్ణయం వెల్లడించే అవకాశముంది. ఇలాంటి దర్యాప్తును న్యాయవాది చూసే అవకాశం ఉందా? అని ACB తరఫు లాయర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. సాయంత్రం గం.4లోపు చెబుతామని దర్యాప్తు సంస్థ తరఫున హాజరైన AAG కోర్టుకు తెలిపారు. దీంతో అప్పుడు తిరిగి ప్రారంభమయ్యే విచారణలో ప్రభుత్వ కౌన్సిల్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
News January 8, 2025
శర్వా సినిమా కోసం రంగంలోకి నందమూరి& కొణిదెల
టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించనున్న SHARWA37 సినిమా ఈనెల 14న లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి & కొణిదెల ఫ్యామిలీలు కలిసి ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. అదేరోజు ఫస్ట్ లుక్& టైటిల్ రివీల్ చేస్తామని పేర్కొన్నారు. ఈ చిత్రంలో సంయుక్తా మేనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించనుండగా రామ్ అబ్బరాజు తెరకెక్కించనున్నారు.
News January 8, 2025
KTRతో పాటు లాయర్ కూర్చోరాదు: HC
లాయర్‌తో ACB విచారణకు హాజరు అయ్యేందుకు అనుమతించాలన్న KTR వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. లాయర్‌ను ఆయనతో పాటు కూర్చోబెట్టలేమని స్పష్టం చేసింది. దూరంగా ఉండి లాయర్ గమనించేందుకు మాత్రం పర్మిషన్ ఇస్తామని KTR లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణలో తెలిపింది. వెంట వెళ్లే ముగ్గురు లాయర్ల పేర్లను ఇవ్వాలని మాజీ మంత్రి కౌన్సిల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను సాయంత్రం గం.4కు వాయిదా వేసింది.