News March 19, 2024
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్ గౌతం
ఎన్నికల నిర్వహణలో ఏ దశలోనూ లోపాలు లేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి, ఏఆర్ఓ , డిఎస్పీ, ఏసీపీ, నోడల్ అధికారులతో లోకసభ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు చాలా కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా సజావుగా జరపాలన్నారు.
Similar News
News November 24, 2024
ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం వాయిదా: కలెక్టర్
మధిర (మం) దెందుకూరులో ఈనెల 24న తలపెట్టిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమం ఈనెల 25కు వాయిదా పడినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో విజయోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
News November 23, 2024
ఖమ్మం జిల్లాను కమ్మేసిన పొగమంచు
ఖమ్మం జిల్లాను శనివారం పొగమంచు కమ్మేసింది. జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అటు ఉదయాన్నే పనికి వెళ్లే రోజువారి కూలీలు ఎముకలు కొరికే చలిలో వెళ్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం 8 గంటల తర్వాతే బయటకు వస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
News November 23, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు
> కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం > భద్రాచలానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాక > కొత్తగూడెం సింగరేణిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం > ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సన్నాహక సమావేశం > చుంచుపల్లిలో నూతన ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంప్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు > నేలకొండపల్లిలో చెరుకు రైతుల సంఘం రాష్ట్ర సదస్సు > పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు