News February 6, 2025

NGKL: కడుపునొప్పి భరించలేక.. వ్యక్తి బలవన్మరణం

image

తీవ్రమైన కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన గంగనమోని భాగయ్య(58) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నొప్పి భరించలేక తన వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.

Similar News

News March 1, 2026

ప.గో: డబ్బులు కొట్టేసేందుకు వచ్చిన ఫోన్ కాల్ ఇది..!

image

సైబర్ క్రైమ్ మోసగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తున్నారు. బురిడీ కొట్టించే ప్రయత్నంలో బెడిసి కొట్టిన ఉదంతం ఆకివీడు మండలంలో వెలుగు చూసింది. అజ్జమూరుకి చెందిన రిటైర్డ్ టీచర్‌కు నిన్న ఉదయం గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంక్‌కి సంబంధించి పత్రాలపై ష్యూరిటీ పెట్టిన సంగతి గుర్తులేదా అంటూ అతడ్ని భయపెట్టారు. ఆయన ధైర్యంగా ఎదుర్కొనే సరికి తోక ముడిచాడు. మళ్ళీ ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు.

News March 1, 2026

హీరో విజయ్‌కు మరో షాక్..

image

తమిళ స్టార్ హీరో విజయ్‌కు వ్యక్తిగత జీవితంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. తన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన వేళ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఓ నటితో విజయ్‌కు అఫైర్ ఉందని తన తల్లి చేసిన ఆరోపణల్లో వాస్తవాలున్నాయని, అందుకే అన్‌ఫాలో చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా భార్య చేసిన ఆరోపణలపై విజయ్ ఇప్పటివరకూ స్పందించలేదు.

News March 1, 2026

రేపు వికారాబాద్‌కు రాహుల్ గాంధీ రాక

image

అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల డీసీసీల శిక్షణా తరగతులు రేపటితో ముగుస్తాయి. ఈ తరగతులకు ఈ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ రానున్నారు. జిల్లా అధ్యక్షులు తీసుకోవాల్సిన నిర్ణయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ చీఫ్ మహేశ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారని సమాచరం. దీనికోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.