News February 6, 2025

NGKL: కడుపునొప్పి భరించలేక.. వ్యక్తి బలవన్మరణం

image

తీవ్రమైన కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన గంగనమోని భాగయ్య(58) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో నొప్పి భరించలేక తన వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.

Similar News

News February 6, 2025

NZB: జూనియర్ కళాశాలను DIEO తనిఖీ 

image

నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ గర్ల్స్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి (DIEO) రవి కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, కెమెరాలు పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా పరీక్షలు జరుగుతున్న మరికొన్ని కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. 

News February 6, 2025

SKLM: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

image

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్సై సందీప్ వివరాల మేరకు.. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని చౌదరి సత్యనారాయణ కాలనీకి చెందిన తరుణ్ (19), పాజిల్ బేగ్ పేటకు చెందిన కార్తీక్ (21) బైక్‌పై వస్తూ డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

News February 6, 2025

KMM: 1,04,995 మందికి రైతు భరోసా నిధులు జమ

image

తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 1,04,995 మంది రైతుల ఖాతాలలో రూ.58,22,56,809 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.

error: Content is protected !!