News February 6, 2025
బంగ్లా పితామహుడి ఇంటికి నిప్పు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738811829940_1045-normal-WIFI.webp)
బంగ్లాదేశ్ పితామహుడిగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని బంగ్లా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. దేశంలోని తమ అవామీ లీగ్ కార్యకర్తలందరూ ఏకమై మహ్మద్ యూనస్ మధ్యంతర సర్కారుపై తిరగబడాలని మాజీ ప్రధాని హసీనా ఆన్లైన్ వీడియోలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రి, బంగబంధు రెహమాన్ భవనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
Similar News
News February 6, 2025
స్టార్ సింగర్ విడాకులు.. భార్యకు $300Mల భరణం?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738823890240_746-normal-WIFI.webp)
కెనడియన్ స్టార్ సింగర్ జస్టిన్ బీబర్, హేలీ బీబర్ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018లో వీరికి వివాహమవగా ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బీబర్ అన్మెచ్యూర్డ్ బిహేవియర్, డ్రగ్స్ వినియోగంపై ఇరువురికీ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో తన బిడ్డ జాక్ బ్లూస్ భవిష్యత్తు కోసం ఆమె విడాకులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. దీని ద్వారా హేలీకి $300 మిలియన్ల భరణం వస్తుందని సమాచారం.
News February 6, 2025
ఇతను నిజమైన మృత్యుంజయుడు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738818894549_746-normal-WIFI.webp)
ఏడుసార్లు మరణం నుంచి బయటపడిన ‘వరల్డ్ లక్కీయెస్ట్ పర్సన్’ ఫ్రాన్ సెలాక్ జీవితం థ్రిల్లర్ మూవీ కంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తొలుత రైలు నదిలో పడిపోతే ఈయన తప్ప అందరూ చనిపోయారు. ఫ్లైట్లో వెళ్తుంటే డోర్స్ ఓపెన్ అవడంతో సెలాక్ గడ్డివాముపై పడి బతికారు. పలు మార్లు భారీ యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. కానీ, అతను చనిపోలేదు. 2003లో రూ.7 కోట్ల లాటరీ గెలుచుకున్నారు. 2016లో 87 ఏళ్ల వయసులో వృద్ధాప్యంతో చనిపోయారు.
News February 6, 2025
మళ్లీ మొరాయించిన చాట్ జీపీటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738827819744_1045-normal-WIFI.webp)
ఏఐ చాట్ బోట్ జీపీటీ మరోసారి మొరాయించింది. తమకు ఆ యాప్ యాక్సెస్ కావడం లేదంటూ సోషల్ మీడియాలో యూజర్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా చాట్ జీపీటీ ఇదే తరహాలో ఆగిపోవడం గమనార్హం. సమస్యపై సంస్థ స్పందించింది. ఏఐ మోడల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, చక్కదిద్దేందుకు ట్రై చేస్తున్నామని వివరణ ఇచ్చింది.