News February 6, 2025

నాగేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటాం: సీతక్క

image

కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి <<15374769>>నాగేశ్వరరావు మృతి<<>> పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని సహకారాలు అందిస్తామన్నారు. నాగేశ్వరరావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News March 13, 2026

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై కలెక్టర్ ఆరా

image

భద్రాద్రి జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో కలెక్టర్ అంకిత్ సమావేశమై మాట్లాడారు. జిల్లాలో ఉన్న నీటి వనరులు, చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటి లభ్యత అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ రైతులకు అవసరమైన నీటిని సకాలంలో అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. రైతు సమస్యలను సేకరించి పరిష్కరించాలన్నారు.

News March 12, 2026

ఆసిఫాబాద్‌లో పదవ తరగతి పరీక్షల భద్రతా ఏర్పాట్లు

image

ఆసిఫాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి (ఎస్‌ఎస్‌సి) పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని, కర్రలు, ఆయుధాలు, రాళ్లు, జిరాక్స్ సెంటర్లపై కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

News March 12, 2026

ఫోన్ పే, గూగుల్ పే‌లో కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారా?

image

ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిలో కరెంట్ బిల్లుల చెల్లింపు ఆప్షన్ పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో లాగా బిల్ జనరేట్ అవ్వడం లేదని, తాత్కాలికంగా బిల్లర్ డౌన్ అంటూ చూపుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? అయితే విద్యుత్ శాఖ అఫీషియల్ యాప్‌లో పవర్ బిల్ పే చేయొచ్చు.