News February 6, 2025
హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట
గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ కేసును కొట్టి వేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని అధికారులను ఆదేశించింది.
Similar News
News February 6, 2025
బాపట్ల: ‘ఆక్వా రైతులు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి’
ఆక్వా రైతులు తమ చెరువులకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని బాపట్ల జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణ కిషోర్ తెలిపారు. గురువారం కర్లపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆక్వా ఇన్సూరెన్స్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఆక్వా రైతులు నష్టపోయిన పరిస్థితులలో ఇన్సూరెన్స్ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు, మండలంలోని ఆక్వా రైతులు పాల్గొన్నారు.
News February 6, 2025
సిరిసిల్ల: చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా గోనె ఎల్లప్ప
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా సిరిసిల్ల పట్టణానికి చెందిన గోనె ఎల్లప్పను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ గురువారం తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలో గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ.. చేనేత రంగానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.
News February 6, 2025
BNGR: చిక్కనంటున్న బాహుబలి దున్న.. డ్రోన్‌తో వేట
యాదాద్రి జిల్లాలో జనావాసాల మధ్య అడవి దున్న సంచరిస్తుండడంతో జిల్లా వాసులంతా భయపడుతున్నారు. ఇటీవల ఆత్మకూరు ఎం మండలం పల్లెల శివారులో కనిపించిన అడవి దున్న.. ఉదయం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు శివారులో ప్రత్యక్షమైంది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు దున్న కోసం డ్రోన్ సహాయంతో గాలిస్తున్నారు. అడవి దున్నను పట్టుకోవడంలో అటవీశాఖ అధికారులు కొంత విఫలమవుతున్నారని పలువురు మండిపడుతున్నారు.