News February 6, 2025
మెదక్ జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

మెదక్ జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. గత వారం రోజుల క్రితం కిలో రూ. 240పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్‌లెస్ KG రూ. 210 నుంచి రూ. 220, విత్ స్కిన్ రూ. 180 నుంచి రూ. 190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్ కోళ్ల చనిపోవడం ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.
Similar News
News March 25, 2026
నర్సాపూర్: స్వయంభూగా కొలువైన సీతారామసమేత ఆలయం

స్వయంభు ఏకాంతంగా వెలిసిన సీతారామ స్వామి ఆలయంగా పేరు పొందుతున్న నర్సాపూర్ పట్టణ సమీపంలోని సీతారాంపూర్లో ప్రతిఏటా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పూజారి హరిప్రసాద్ శర్మ తెలిపారు. 600 ఏళ్ల క్రితం కాకతీయులు ఆలయం నిర్మించినట్లు తెలిపారు. శ్రీ సీతారామసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ఉత్సవాల గురించి ఆయన వే2న్యూస్‌తో తెలిపారు. ఉదయగిరి చుట్టూ బండ్ల ప్రదక్షిణలు నిర్వహిస్తారన్నారు.
News March 24, 2026
మెదక్: ‘జనగణన పక్కాగా నిర్వహించాలి’

జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మండల ప్రణాళిక అధికారులు, సాంకేతిక సహాయకులకు జనగణన ప్రక్రియ, మొబైల్ యాప్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. వివరాల సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, ఏప్రిల్‌లో సన్నాహక పనులు చేపడతామన్నారు.
News March 24, 2026
సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం: కలెక్టర్ ప్రతిమా సింగ్

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. 917 హ్యాబిటేషన్లలో 1.76 లక్షల కుటుంబాలకు నిరంతర నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 1485 ట్యాంకుల శుభ్రత, బోర్లు, పైపుల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా పర్యవేక్షణతో పాటు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని తెలిపారు.


