News February 6, 2025

ఇసుక మాఫియాపై సీఎం ఉక్కు పాదం..!

image

భద్రాద్రి జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న 17 ఇసుక ర్యాంపులను నిలిపివేయాలని సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రీచ్‌ల యాజమాన్యం వ్యవహరిస్తుండటం, వే బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో సీఎం అధికారులను ఆదేశించారు.

Similar News

News March 20, 2026

ఇంటి పనులను భర్త షేర్ చేసుకోవాలి: సుప్రీంకోర్టు

image

తన భార్యకు వంట సహా ఇంటి పనులు సరిగ్గా చేయడం రాదంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలం మారిందని, ఇంటి పనులను భర్త కూడా షేర్ చేసుకోవాలని పేర్కొంది. ‘మీరు పనిమనిషిని కాదు.. జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకున్నారు’ అని తెలిపింది. తన పేరెంట్స్‌కు ఆహారం పెట్టడానికి ఆమె నిరాకరించిందని భర్త కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

News March 20, 2026

‘ఎక్కడ ఉన్నా చంపేస్తాం’.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

image

అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు, సైనికులకు ఇరాన్ IRGC స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ప్రపంచంలో మీకు ఏ ప్రాంతం సురక్షితం కాదు. రిసార్టులు, టూరిస్టు ప్లేసులు ఇలా మీరు ఎక్కడ ఉన్నా చంపేస్తాం’ అని హెచ్చరించింది. కాగా ఇరాన్ ప్రతినిధులను వరుసగా చంపేస్తుండటంతో IRGC ఈ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
*ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి అప్‌డేట్‌లో ఉండండి.

News March 20, 2026

పల్నాడు జిల్లాలో కనిపించిన నెలవంక

image

పల్నాడు జిల్లాలోని దాచేపల్లిలో శుక్రవారం రాత్రి నెలవంక కనిపించడంతో శనివారం రంజాన్ పండుగ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నెలరోజుల ఉపవాసాన్ని ముస్లింలు విరమించారు. పట్టణంలోని మసీదులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. దాచేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఉన్న ఈద్గా వద్ద శనివారం ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.