News February 6, 2025

Way2News ఎఫెక్ట్.. విజయనగరం DM&HO విచారణ

image

గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి మంగళవారం ప్రసవానికొచ్చిన గర్భిణిని జిల్లా కేంద్రాసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై <<15363231>>Way2News<<>>లో ‘108లో మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి’ అని వార్త పబ్లిష్ అయ్యింది. ఈ వార్తపై DM&HO జీవరాణి స్పందించారు. ఆసుపత్రిలో బుధవారం విచారణ చేపట్టారు. ముగ్గురు గైనకాలజిస్టులు ఉండగా జిల్లా ఆస్పత్రికి ఎలా రిఫర్ చేస్తారని ప్రశ్నించారు. ఘటపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Similar News

News February 6, 2025

ఈనెల 10న డీ వార్మింగ్ డే: కలెక్టర్ అంబేడ్కర్

image

విజయనగరం జిల్లాలో గుర్ల మండలంలో తప్ప జిల్లా అంతటా ఈ నెల 10న డీ వార్మింగ్ డే సందర్భంగా అల్బెండజోల్ మాత్రలను సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు. గుర్ల మండలంలో బోదకాలుకు సంబంధించిన మాత్రలు వేస్తున్నందున నులిపురుగుల నివారణా మాత్రలు ప్రస్తుతం వేయడం లేదని తెలిపారు. 19 ఏళ్లలోపు ఉన్న వాళ్లంతా అల్పెండజోల్ మాత్రలు వేసుకోవాన్నారు.

News February 6, 2025

వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిళ్లు ‘కొండవెలగాడ’

image

వెయిట్ లిఫ్టింగ్‌కు పుట్టినిల్లు కొండవెలగాడ తన పేరును సార్థకం చేసుకుంది. వల్లూరి శ్రీనివాసరావు, మత్స సంతోషి లాంటి సీనియర్ లిఫ్టర్లు ఈ గ్రామం నుంచే వెళ్లి కామన్ వెల్త్‌లో ఛాంపియన్స్‌గా నిలిచి దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో నిలిపారు. వాళ్లని ఆదర్శంగా తీసుకొని పదుల సంఖ్యలో క్రీడాకారులు గ్రామం నుంచి పుట్టుకొచ్చారు. తాజాగా జాతీయస్థాయిలో జరిగిన పోటీల్లో గ్రామానికి చెందిన శనపతి పల్లవి గోల్డ్ మెడల్ కొట్టింది.

News February 6, 2025

చీపురుపల్లిలో ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

image

ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చీపురుపల్లి మండలంలో చోటుచేసుకుంది. రేగిడిపేటకు చెందిన దన్నాన శ్రీనువాసరావు (35) బుధవారం రాత్రి తన బైక్‌పై గరివిడి నుంచి చీపురుపల్లి వస్తున్నాడు. ఆంజనేయపురం సమీపంలోకి వచ్చేసరికి ట్రాక్టర్ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో శ్రీనివాసరావు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

error: Content is protected !!