News February 6, 2025

నర్సు నిర్వాకం.. గాయానికి కుట్లకు బదులు పెవిక్విక్

image

మనకు ఏదైనా గాయమైతే వైద్యులు కుట్లు వేస్తారు. అయితే కర్ణాటక హవేరి(D)లోని అడూర్ PHCలో స్టాఫ్ నర్స్ జ్యోతి ఫెవిక్విక్‌తో చికిత్స చేసింది. ఏడేళ్ల బాలుడి చెంపకు గాయమవడంతో పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నర్సు గాయానికి కుట్లు వేస్తే మచ్చలు పడతాయని చెప్పి ఫెవిక్విక్ రాసి బ్యాండేజ్ వేసింది. పేరెంట్స్ అభ్యంతరం చెప్పినా వినలేదు. ఈ ఘటనపై వారు చేసిన ఫిర్యాదుతో అధికారులు నర్సును సస్పెండ్ చేశారు.

Similar News

News February 6, 2025

విద్యార్థినిపై అత్యాచారం.. నటి తీవ్ర ఆవేదన

image

అత్యాచారాలకు పాల్పడే వారికి జీవించే అర్హత లేదని BJP నేత, నటి కుష్బూ సుందర్ అన్నారు. తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు <<15375607>>అఘాయిత్యానికి<<>> పాల్పడటంపై ఆమె ఆగ్రహించారు. ‘ఇళ్లలో, వీధుల్లో, విద్యా సంస్థల్లో, హాస్టళ్లలో ఎక్కడా పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. పిల్లలు, మహిళలపై ఇలాంటివి జరగకుండా ఆపాలి. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లను కఠినంగా శిక్షించి సమాజానికి ఓ హెచ్చరిక ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.

News February 6, 2025

Stock Markets: తప్పని నష్టాలు..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టపోయాయి. నిఫ్టీ 23,603 (-92), సెన్సెక్స్ 78,058 (-213) వద్ద క్లోజయ్యాయి. ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎక్కువ లాభపడ్డాయి. రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, మీడియా, మెటల్, ఎఫ్ఎంసీజీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. సిప్లా, అదానీ పోర్ట్స్, ఐటీసీ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ టాప్ గెయినర్స్. ట్రెంట్, బీఈఎల్, ఎయిర్‌టెల్, టైటాన్, ఓఎన్జీసీ టాప్ లూజర్స్.

News February 6, 2025

బీసీలకు రేవంత్ అన్యాయం: ఆర్.కృష్ణయ్య

image

TG: రాష్ట్రంలోని బీసీలకు కేసీఆర్ కంటే CM రేవంత్ ఎక్కువ అన్యాయం చేస్తున్నారని బీసీ నేత ఆర్.కృష్ణయ్య విమర్శించారు. BCలకు చట్టప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో జరిగిన కులగణనలో చాలా బీసీ కుటుంబాలు పాల్గొనలేదు. లేదంటే బీసీల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. కులగణనపై చట్టం చేస్తే మేం సుప్రీంకోర్టులో పోరాడుతాం. రాజకీయాలు చేయడం మాకూ వచ్చు’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

error: Content is protected !!