News February 6, 2025

NLG: దేవుడా.. అప్పుడే మండుతున్న ఎండలు

image

చలికాలం పూర్తికాక ముందే ఎండలు మొదలయ్యాయి. ఫిబ్రవరి తొలివారంలోనే పగటి పూట 40 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. బుధువారం నల్గొండ (D) అనుముల మం. ఇబ్రహీంపేటలో 37.4, యాదాద్రి (D)బొమ్మలరామారంలో 37.3, సూర్యాపేట (D) నూతన్‌కల్‌లో 37.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయంపూట దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఈ విచిత్ర వాతావరణంలో ప్రజలులు అవస్థలు పడుతున్నారు.

Similar News

News April 4, 2026

నల్గొండలో మండిపోతున్న ఎండలు

image

నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరడంతో ఉదయం 9 నుంచే తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని అంచనా. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండ ప్రభావం అధికంగా ఉంటుంది. కావున ప్రజలు డీహైడ్రేషన్ బారిన పడకుండా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు బాగా తాగాలి. ఎండలో బయటకు వస్తే టోపీ, సన్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలి.

News April 4, 2026

నల్గొండ: 5 వరకు ‘మీ-సేవ’లు బంద్

image

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా జిల్లాలో 78 మీ-సేవ కేంద్రాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మూతపడతాయి. మళ్లీ ఆదివారం ఉదయం 8 గంటలకు పెరిగిన చార్జీలతో ఇవి తెరుచుకుంటాయి. ప్రభుత్వం ఏ-కేటగిరీ సేవలను రూ.35 నుంచి 62కు, బీ-కేటగిరీని రూ.45 నుంచి 80కి పెంచింది. కొత్త ధరలు 5వ తేదీ నుంచి అమలవుతాయి. ఈ తాత్కాలిక మూసివేతపై ఆయా కేంద్రాల వద్ద బోర్డులు పెట్టాలని నిర్వాహకులను ప్రభుత్వం ఆదేశించింది.

News April 3, 2026

NLG: ధాన్యం పక్కదారి.. మిల్లర్లపై చర్యలేవి?

image

నల్గొండ జిల్లాలో సిఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై ఇప్పటికీ కఠిన చర్యలు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. 2022-23 సీజన్‌కు చెందిన రూ.191.13 కోట్ల విలువైన 5,89,533 క్వింటాళ్ల ధాన్యాన్ని 7 మిల్లులు దుర్వినియోగం చేసినట్లు తనిఖీల్లో తేలింది. కేసులు నమోదు చేసినప్పటికీ రాజకీయ నాయకుల చొరవతో చర్యలు నెమ్మదిస్తున్నాయి. కేసులో ఇప్పటికే ఒకరు అరెస్ట్ కాగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు.