News February 6, 2025
త్వరలో ‘ఎల్లమ్మ’ నుంచి అప్డేట్: వేణు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738815957199_746-normal-WIFI.webp)
‘బలగం’ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ వేణు నెక్స్ట్ సినిమా ‘ఎల్లమ్మ’ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనిపై వేణు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘సిద్ధమవుతున్నా. త్వరలో అప్డేట్ వస్తుంది’ అని పేర్కొంటూ జిమ్లో కసరత్తు చేస్తోన్న ఫొటోలు షేర్ చేశారు. దీంతో ఈ సినిమాలో వేణు కూడా ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపిస్తారనే చర్చ మొదలైంది.
Similar News
News February 6, 2025
విద్యార్థినిపై అత్యాచారం.. నటి తీవ్ర ఆవేదన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738835528749_893-normal-WIFI.webp)
అత్యాచారాలకు పాల్పడే వారికి జీవించే అర్హత లేదని BJP నేత, నటి కుష్బూ సుందర్ అన్నారు. తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు <<15375607>>అఘాయిత్యానికి<<>> పాల్పడటంపై ఆమె ఆగ్రహించారు. ‘ఇళ్లలో, వీధుల్లో, విద్యా సంస్థల్లో, హాస్టళ్లలో ఎక్కడా పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. పిల్లలు, మహిళలపై ఇలాంటివి జరగకుండా ఆపాలి. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లను కఠినంగా శిక్షించి సమాజానికి ఓ హెచ్చరిక ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.
News February 6, 2025
Stock Markets: తప్పని నష్టాలు..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734431223590_1124-normal-WIFI.webp)
దేశీయ స్టాక్మార్కెట్లు నేడు నష్టపోయాయి. నిఫ్టీ 23,603 (-92), సెన్సెక్స్ 78,058 (-213) వద్ద క్లోజయ్యాయి. ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎక్కువ లాభపడ్డాయి. రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, మీడియా, మెటల్, ఎఫ్ఎంసీజీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. సిప్లా, అదానీ పోర్ట్స్, ఐటీసీ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ గెయినర్స్. ట్రెంట్, బీఈఎల్, ఎయిర్టెల్, టైటాన్, ఓఎన్జీసీ టాప్ లూజర్స్.
News February 6, 2025
బీసీలకు రేవంత్ అన్యాయం: ఆర్.కృష్ణయ్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738836069316_1032-normal-WIFI.webp)
TG: రాష్ట్రంలోని బీసీలకు కేసీఆర్ కంటే CM రేవంత్ ఎక్కువ అన్యాయం చేస్తున్నారని బీసీ నేత ఆర్.కృష్ణయ్య విమర్శించారు. BCలకు చట్టప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో జరిగిన కులగణనలో చాలా బీసీ కుటుంబాలు పాల్గొనలేదు. లేదంటే బీసీల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. కులగణనపై చట్టం చేస్తే మేం సుప్రీంకోర్టులో పోరాడుతాం. రాజకీయాలు చేయడం మాకూ వచ్చు’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.