News February 6, 2025

డెంకాడలో టీచర్ ఆత్మహత్యాయత్నం..!

image

డెంకాడ మండలంలోని మోదవలస సమీపంలో ఓ ఉపాధ్యాయురాలు బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. బలిజిపేట మండలానికి చెందిన ఆమె కొత్తవలసలోని ఓ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ తరగతుల్లో భాగంగా ఐదు రోజుల క్రితం రాగా.. గదిలో ఉరివేసుకునేందుకు యత్నించారు. వెంటనే గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ నాయుడు తెలిపారు.

Similar News

News March 13, 2026

విజయవాడలో ప్రమాదం.. MBBS విద్యార్థి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల విద్యార్థి లిఖిత్ సాయి (MBBS) దుర్మరణం చెందారు. శ్రీకాళహస్తికి చెందిన ఆయన గురువారం రాత్రి రామవరప్పాడు నుంచి వస్తుండగా, పరిణయ కళ్యాణ మండపం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయారు. తలకు తీవ్ర గాయమవ్వడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం నిలిచేదని స్థానికులు చెబుతున్నారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 13, 2026

సిద్దిపేట: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

28న సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, మోటార్ వాహనాల కేసులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్, కంపౌండ్డబుల్, సివిల్, చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కంటే లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు.

News March 13, 2026

KMR: ఇంటర్ పరీక్షలు.. 97.46% హాజరు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్ ద్వితీయ సంవత్సర కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 7,649 మంది విద్యార్థులకు గాను 7,455 మంది హాజరయ్యారని, 194 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లాలో 97.46 శాతం హాజరు నమోదైందని ఆయన వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.